30-01-2026 01:58:06 AM
‘నేషన్ బిల్డింగ్’ నుంచి ‘మాస్ కండిషనింగ్’ వైపు పాలన
పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేఖ బోయపల్లి
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభు త్వాన్ని ప్రశ్నించడమే నేరమవుతోందని పీసీ సీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయపల్లి విమర్శించారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తున్న యువత గొంతులను అణ చివేస్తోందని మండిపడ్డారు. గురువారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ధరల పెరుగుదల, నిరుద్యోగం, కా లుష్యంతో పాటు రోడ్ల దుస్థితి తదితర అం శాలపై యువ కార్యకర్త అశ్విన్ గౌతమ్ నిలదీస్తుండటంతో మోదీ సర్కార్‌కు భయం పట్టుకుందని రేఖ బోయపల్లి తెలిపారు.
లగ్జరీ కార్లలో తిరుగుతూ, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డులు పొందుతున్న 10 ఏళ్ల ప్రవచనకారుడు ప్రశంసలు పొందుతుంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ బాలు డిపై మాత్రం కేసులు, బెదిరింపులు, వేధింపులు జరుగుతున్నాయని ఆమే ఆవేదన వ్య క్తం చేశారు. శాస్త్రం స్థానంలో మూఢనమ్మకాలు, పండితుల స్థానంలో బాబాలు ముం దుకు వస్తే పాలన ‘నేషన్ బిల్డింగ్’ నుంచి ‘మాస్ కండిషనింగ్’ వైపు జారుతుందని ఆమె హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ప్రశ్నలపై, చర్చలపై, బాధ్యతపై నిలబడుతుంది.. భయం, బలవంతంపై కాదన్నారు. ప్రశ్నించే పిల్లాడు దేశానికి ప్రమాదం కాదని, మౌనంగా ఉండే సమాజమే అసలు ప్రమాదమని ఆమె పేర్కొన్నారు.