27-09-2025 01:24:51 AM
హనుమకొండ,(విజయక్రాంతి): కట్టడాలకు ఉపయోగించే స్టీల్ లలో పిఎస్కే స్టీల్ అత్యంత దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగినదని పీఎస్కే తెలంగాణ జనరల్ మేనేజర్ సుతారి వేణు కుమార్ అన్నారు. మణికొండ సత్యసాయి కన్వెన్షన్ లో నిర్వహించిన నేషనల్ కాన్క్లేవ్ స్పేస్.2025 లో ప్రదర్శించిన సిల్వర్ ర్యాంకు కలిగిన ఎగ్జిబిషన్లో పిఎస్కే స్టాల్ లో వేణు కుమార్ మాట్లాడుతూ సూపర్ డెక్టైల్ అనగా మెత్తగా, దృఢత్వం కలిగి ఉండి,600 గ్రేడ్ ప్లస్ ఎస్డీ ర్యాంకింగ్ తో అత్యంత నమ్మకం కలిగిన స్టీల్ ను పిఎస్కే గ్రూప్ అందిస్తుందని, తెలంగాణ తోపాటు, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఈ ఉత్పత్తి లభిస్తుందని, ఆర్డర్ చేసిన 24 గంటలలోనే దిగుమతి చేసే అవకాశం ఉంటుందన్నారు.
తెలంగాణలో అన్ని ప్రాంతాలలో ఉచిత దిగుమతి సౌకర్యం ఉందన్నారు. ఇటీవల కాలంలో అత్యంత లాభదాయకంగా అమ్మకం చేసిన 30 మంది డీలర్లకు దుబాయిలో ఆతిథ్యం కల్పించినట్టు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా 100 రోజుల్లో 100 టన్నులు స్టీల్ అమ్మకం చేసిన వ్యాపారులకు సింగపూర్లో ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అనంతరం భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు పి ఎస్ కే స్టీల్ గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏఎస్ఎం శివ సాయి, నరేష్ రంజిత్, రాజేష్,శరత్, మహేందర్, సూర్యాపేట రిజ్వాన్ స్టీల్ ఏజెన్సీ యజమాని మౌలాలి, కరీంనగర్ ఖమ్మం జిల్లాల మార్కెటింగ్ ఏజెంట్లు, తదితరులు పాల్గొన్నారు.