calender_icon.png 27 September, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికారాబాద్ జిల్లాలో కుండపోత వర్షం..

27-09-2025 01:24:56 AM

తాండూరు, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి ): గత రాత్రి నుండి వికారాబాద్ జిల్లాలో ఏకధాటిగా కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాండూరు నియోజకవర్గం లోని కోటిపల్లి సాగునీటి ప్రాజెక్టు లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో అలుగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది. బిజ్జారం వాగు పొంగి పొర్లుతుండడంతో గ్రామానికి రాకపోకలు తెగిపోయాయి.కాగ్న నదిలోకి భారీ వర్షపు నీరు రావడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది .

తాండూర్ పట్టణంలోని పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. పెద్దేముల్ మండలం తట్టేపల్లి వాగు సైతంతో పొంగి పొరలడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు .మరోవైపు గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పత్తి పంట నల్లబారి రైతన్నలకు తీవ్ర నష్టం  కలుగనుందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.