12-09-2025 12:59:27 AM
ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలు విడుదల
చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఊరట లభించింది. గతంలో విచారణలో భాగం గా హెచ్‌సీఏ బ్యాంకు ఖాతాలను సీఐడీ ఫ్రీజ్ చేసిం ది. దీంతో హెచ్‌సీఏ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఫ్రీజ్ చేసిన ఖాతాలను విడుదల చేయాలని సీఐడీకి గురువారం ఆదేశాలు జారీ చేసింది.
హెచ్‌సీఏ నిబంధనల మేరకు ఖాతాల నిర్వహణకు అనుమతిచ్చింది. లావాదేవీలకు అనుమతించాలని బ్యాంకును హైకోర్టు ఆదేశించింది. కాగా హెచ్‌సీఏ బ్యాంకు ఖాతాలకు, అవినీతి కేసులో అరెస్టు అయిన వారికి సంబంధం లేదని కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా నిబంధనల మేరకు లావాదేవీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.