calender_icon.png 24 December, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసమస్యల పరిష్కారానికే బస్తీబాట

24-12-2025 02:13:00 AM

తార్నాక డివిజన్‌లో డిప్యూటీ మేయర్ శ్రీలత పర్యటన

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 23 (విజయక్రాంతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపేందుకే బస్తీబాట చేపట్టామని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆమె తార్నాక డివిజన్ పరిధిలోని వినోబానగర్, సిరిపూర్ నగర్ కాలనీ, లాలాపేట్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

స్థానికులతో మమేకమై వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. వినోబా నగర్‌లో కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్య వేధిస్తోందని స్థానికులు డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆమె, వెంటనే డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ పనులు చేపట్టాలని, దెబ్బతిన్న రోడ్లను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం సిరిపూర్‌నగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. జీహెఎంసీ నిధులతో బడ్జెట్ కేటాయించి, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న నాలా విస్తరణ, పూడికతీత పనులను కూడా ఆమె పరిశీలించారు. తార్నాక డివిజన్‌ను అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.