18-08-2024 12:15:42 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి) : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రి సీతక్కను బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజు ల లింగంగౌడ్ కోరారు. ఈ మేరకు శనివారం మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈసందర్భంగా జాజుల మాట్లాడుతూ.. కులగణన చేపట్టడంతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రె స్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో పేర్కొందన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘం ఓయూ కన్వీనర్ మార్త భాను పాల్గొన్నారు.