calender_icon.png 22 November, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీలో పలు శాఖల అధికారుల బదిలీ

18-08-2024 12:11:35 AM

ఉత్తర్వులు జారీచేసిన కమిషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో సానిటేషన్ విభాగంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్)గా విధులు నిర్వహిస్తున్న 27 మందిని కమిషనర్ ఆమ్రపాలి బది లీ చేశారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. వీరంతా చాలా కాలంగా ఆయా సర్కిళ్లలో పనిచేస్తున్న నేపథ్యంలో బదిలీలు చేసినట్లు సమాచారం. ఆదివారం సెలవు రోజు కావడంతో వీరంతా సోమ లేదా మంగళవారం చార్జ్ తీసుకునే అవకాశం ఉంది.

టౌన్ ప్లానింగ్ విభాగంలో..

జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో పలువురు అధికారులను బడిలీ చేస్తూ కమిషనర్ ఆమ్ర పాలి ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ జోన్‌లో సిటీ ప్లానర్‌గా విధు లు నిర్వహిస్తున్న శ్యామ్ కుమార్ శేరిలింగంపల్లి జోన్ సిటీ ప్లానర్‌గా, శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ సిటీ ప్లానర్‌గా బాధ్యతల్లో ఉన్న గణపతి కూకట్‌పల్లి జోన్ సిటీ ప్లానర్‌గా, కూకట్‌పల్లి జోనల్ సిటీ ప్లానర్ ఉమాదేవి చార్మినార్ జోన్ సిటీప్లానర్‌గా, వరంగల్ నుంచి బదిలీపై వచ్చి న వెంకన్న ప్రధాన కార్యాలయంలో ఖైరతాబాద్ జోన్ అడిషనల్ సీపీగా, మల్కాజిగిరి ఏసీపీగా పనిచేస్తున్న శ్రీనివాస్ యాదవ్‌ను ఎల్‌బీనగర్ సిటీ ప్లానర్‌గా, కుత్బుల్లా పూర్ ఏసీపీగా పనిచేస్తున్న సాయిబాబాను శేరిలింగంపల్లి జోన్‌లో ఏసీపీగా బదిలీ చేస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు.