calender_icon.png 2 January, 2026 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఖాందేవ్ జాతర

02-01-2026 01:31:39 AM

  1. పెద్దపులినే దైవంగా భావిస్తూ ఆదివాసీల పూజలు
  2. మొక్కులు తీర్చుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌కు తరలివస్తున్న తొడసం వంశస్థులు

ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 1 (విజయక్రాంతి): తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సాంప్ర దాయాలు, ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూవస్తున్న ఆదివాసీలు ఆ సంప్రదాయాన్ని నేటి తరానికి అందిస్తున్నారు. పుష్య మాసం వచ్చిందంటే చాలు ఆదివాసీలు ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో నియమనిష్టలతో ప్రకృతి లోని చెట్లు, పుట్టలు, పాములు, పులులు ఇలా అడవి జంతువులను పూజించడం ఆదివాసీల ప్రత్యేకం. ఇదే కోవాలో పెద్దపులిని పూజించే ఖాందేవ్ జాతర ఒకటి.

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేం ద్రంలో కొలువుదీరిన ఖాందేవ్ దేవుడికి శుక్రవారం రాత్రి తొడసం వంశం గిరిజనుల ప్రత్యేక పూజలతో జాతర ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు కొనసాగే జాతరకు ఉమ్మడి జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని తొడసం వంశం గిరిజనులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇంటి వద్ద స్వయంగా తయారుచేసిన నువ్వు ల నూనెను దేవుడు ముందు కూర్చొని తొడసం వంశం ఆడపడుచులు దాదాపు రెండు లీటర్ల పైగా తాగడం ఈ జాతర ప్రత్యేకత.