calender_icon.png 19 September, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుడా అభివృద్ధి పనులపై సమీక్ష

19-09-2025 12:00:00 AM

పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం

నూతన లేఅవుట్లకు ప్రతిపాదనలు 

కరీంనగర్, సెప్టెంబర్18(విజయక్రాంతి): శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యకలాపాలపై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,సుడా వైస్ ఛైర్మన్,మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సమీక్ష నిర్వహించారు. సుడా కార్యాల యంలో సుడా చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంతో పాటు చొప్పదండి,మానకొండూర్ నియోజకవ ర్గాలలో పలు అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు నగరంలో మిగిలిపోయిన పలు కూడళ్ల సుందరీకరణ సుడా పరి ధిలో చేపట్టబోయే నూతన లేఅవుట్లు తదితర అంశాలపై చర్చించినట్టు నరేందర్ రెడ్డి తెలిపారు.సుడా కమర్షియల్ బిల్డింగ్ మరియు ఐడీఎస్‌ఎంటి పనులు త్వరితగతిన పూర్తి చే యాలని అధికారులను ఆదేశించారు.

సుడా పరిధిలో నూతన లేఅవుట్లు ఏర్పాటు చేయాలని అందుకు గతంలో గుర్తించిన ప్రాంతాలపై రెవెన్యూ, ల్యాండ్ సర్వే సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తయారు చేసి లేఅవుట్లు చేయాలని నిర్ణయించినట్టు నరేందర్ రెడ్డి పే ర్కొన్నారు.వన్ టౌన్ పోలీస్టేషన్ ఎదురుగా చొక్కారావు ఐల్యాండ్ పక్కన ఉన్న ఐల్యాండ్ సుందరీకరణ చేయాలని నగరలోని ప్రధాన రోడ్లలో గల నాలాల బ్రిడ్జిలపై ఇరువైపులా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో బ్రిడ్జి మాదిరిగా ప్లాంట్స్ తో సుందరీకరణ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

చొప్పదండి నియోజక వర్గంలోని కొక్కేరకుంట కోనాయపల్లి రోడ్డు కు నిధులు కేటాయించడం జరిగిందని ఇంకా పలు అభివృద్ధి పనులు మరియు సుడాకు అభివృద్ధి చార్జీలు కట్టని పెట్రోల్ బంకులకు నోటీసులివ్వాలని కమర్షియల్ గా నడుపుతూ సుడా అభివృద్ధి పన్నులు చెల్లించని ఫామ్ లకు కూడా నోటీసులివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ సమా వేశంలో సీపీవో ఆంజనేయులు,ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈ రొడ్డ యాదగిరి,డిఈఈ రాజేంద్ర ప్రసాద్, టీపీవో శ్రీధర్ ప్రసాద్,టీపీఎస్ సంధ్య, అజ్మల్ తదితరులుపాల్గొన్నారు.