calender_icon.png 1 October, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన ఆర్టీవో పార్థ సింహారెడ్డి

01-10-2025 12:43:51 AM

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): త్వరలో జరిగే స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు బ్యాలెట్ బాక్సుల భద్రపరుచుటకు కౌంటింగ్ హాల్ , స్ట్రాంగ్ రూములను ఎల్లారెడ్డి ఆర్టీవో పార్థసింహారెడ్డి, తాసిల్దార్ ప్రేమ్ కుమార్ మంగళవారం పరిశీలించారు.

ఎల్లారెడ్డి పట్టణంలోని ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ అవసర నిమిత్తం అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్, శ్రీనివాస్, ఎంపీడీవో ప్రకాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు.