calender_icon.png 13 August, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తూరులో వరస ప్రమాదాలు.. ఒకరు మృతి

12-07-2024 03:37:43 PM

కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం వద్ద వరస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొత్తూరు వద్ద మొదట లారీని డీసీఎం ఢీకొట్టింది. లారీ క్యాబిన్ లో ఇరుకున్న డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన లారీని, డీసీఎంను మరో డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన డీసీఎంను ఢీకొని బైకుపై వెళ్తున్న వ్యక్తి మృతిచెందారు. మృతుడిని కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన అంజయ్యగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తలించారు.