24-12-2025 12:13:03 AM
వనపర్తి క్రైమ్, డిసెంబర్ 23 : వనపర్తి క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ నవంబర్ 24 నుంచి 27వ తేదీ వరకు మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన అండర్ 19 క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైన మహిళా క్రికెట్ క్రీడాకారులను మంగళవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శాలువలతో సన్మానించి అభినందించారు.
డిసెంబర్ 31న మధ్యప్రదేశ్లోని భూపాల్ లో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన స్వాతి ఝాన్సీ సింధుజ పునరీ లను ఎమ్మెల్యే అభినందించారు. ఉన్నత చదువుతోపాటు క్రీడలపై కూడా దృష్టి సారిస్తే ప్రపంచ స్థాయి గుర్తింపును పొందవచ్చునని ఆయన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ కోచర్ ఝాన్సీ లక్ష్మి మన్నన్ తదితరులు పాల్గొన్నారు.