calender_icon.png 22 January, 2026 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీటీడీ జేఈఓగా శరత్ నియామకం

22-01-2026 12:56:03 AM

మిర్యాలగూడ, జనవరి 21 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం   కొండ్రపోల్ సమీపంలో గల పార్థునాయక్ తండకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ ఏ. శరత్ ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విద్యా వైద్యం, విభాగాల జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి (జేఈఓ) గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ ఈనెల 20న జీవో జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక  ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ డాక్టర్ శరత్ జూలై నెలలో రిటైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 19 ఆగస్టు 2025 న తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్ (తెలంగాణ రెనువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) చైర్మన్ గా నియమించారు.

తెలంగాణ రాష్ట్రం 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన డాక్టర్ శరత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అధికారులలో ఒకరుగా పేరుపొందారు. డాక్టర్ శరత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం లో (కుప్పం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ)  కాడ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. టీటీడీ జేఈఓగా డాక్టర్ ఏ శరత్ నియామకం కావడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా గిరిజన అధికారులు ప్రజాప్రతినిధులు,  జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీతారాం నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, మాజీ సర్పంచ్ ఆనంద్ నాయక్, న్యాయవాది శ్రీధర్ గౌడ్, కే మాతృ నాయక్, జైత్రం నాయక్, మహేందర్ నాయక్, డాక్టర్ జితేందర్ నాయక్, నాయకులు శశిధర్ నాయక్ తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు.