calender_icon.png 16 August, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మరంగా రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్

07-08-2025 01:44:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): వర్షాకాలాన్ని దృష్టిలో ఉం చుకొని నగరంలో ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే రోడ్డుపై గుంతలు (ప్యాచ్ హోల్స్), క్యా పిట్స్ మరమ్మత్తులు, సెంట్రల్ మీడియన్ చిన్న పనులపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్‌లో మొత్తం 225 బీటీ/సీసీ రోడ్డుపై గుంతలు పూడ్చారు. అలాగే 7 క్యా పిట్స్‌ను మరమ్మతు చేయడం, 10 క్యాపిట్ కవర్లను మార్చడం, 3 సెంట్రల్ మీడియన్ చిన్న పనులు కూడా పూర్తి చేయడం జరిగింది.

ఇప్పటి వరకు 11,399కు గాను 8158 మరమ్మతులు పూర్తిచేశారు. జోన్ల వారీగా వివరాలు చార్మినార్ జోన్: నేడు 32 పాట్ హోల్స్ పూడ్చడం, 5 క్యా పిట్స్ మరమ్మతు, ఎల్బీనగర్ జోన్: 21 పాట్ హోల్స్, ఖైరతాబాద్ జోన్: 15 పాట్ హోల్స్, శేరిలింగంపల్లి జోన్: 42 పాట్ హోల్స్, కూకట్‌పల్లి జోన్: 37 పాట్ హోల్స్, 2 క్యా పిట్స్, 3 కవర్ రీప్లేస్‌మెంట్, సికింద్రాబాద్ జోన్: 78 పాట్ హోల్స్, 1 క్యాపిట్ కవర్ మార్చారు. రోడ్లను సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ఈ చర్య లు కొనసాగుతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌పేర్కొన్నారు.