calender_icon.png 15 August, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షానికి జలమయమైన రోడ్లు

11-08-2025 01:09:22 AM

గద్వాల టౌన్, ఆగస్టు 10:గత రెండు రో జులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గద్వాల పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.రోడ్లపైనే నీళ్లు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి.ప్రధాన రహదారుల వద్ద నాళాలు పొంగిపొర్లాయి. దీం తో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రధాన రహదారి పక్కన ఉన్న అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సరైన డ్రైనేజీలు నాలాల సౌకర్యాలు లేక వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీదకే వచ్చి నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రమాదా భరితంగా రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.