27-10-2025 12:52:52 AM
ములకలపల్లి, అక్టోబర్ 26, (విజయక్రాంతి); బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారా వు, అశ్వారావుపేట ఇంచార్జ్ మెచ్చ నాగేశ్వరావు ఆదేశాలతో గుంతలతో సెల్ఫీ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆ పార్టీ నాయకులు వర్షాలకు దెబ్బ తిన్న రోడ్లను పరిశీలించారు.
ములకలపల్లి నుంచి దమ్మపేట ప్రధాన రహదారి, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాలకు అను సంధానంగా ఉన్న ప్రధాన రహదారుల్లో ఏర్పడ్డ గుంతలను మండల నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోరంపూడి అ ప్పారావు గారు మాట్లాడుతూ ప్రధాన రహదారుల్లో ఏర్పడ్డ గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయన్నారు.
గుంతలు ఏర్పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల వాహనదారులు నిత్యం ఎన్నో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభు త్వం వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.