27-10-2025 12:00:00 AM
-మహిళల ఆరోగ్య సంరక్షణకు మేలు
-గైనకాలజీలో రోబోటిక్ హారిజన్స్ సమావేశంలో డాక్టర్ మంజుల అనగాని
-కేర్ ఆస్పత్రి సహకారంతో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గైనకాలజికల్ ఎండోస్కోపిస్ట్స్- తెలంగాణ చాప్టర్, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ కలిసి బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ సహకారంతో తాజ్ డెక్కన్‌లో రోబోటిక్ హారిజన్స్ ఇన్ గైనకాలజీ పేరుతో ఒక రోజు వైద్య విద్యా సమా వేశాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణ లో కొత్త దిశను చూపించారు.
ప్రముఖ సర్జన్లు, అధ్యాపకులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు పాల్గొ న్న ఈ కార్యక్రమంలో, గైనకాలజీ శస్త్రచికిత్సల్లో ఖచ్చితత్వం, భద్రత, త్వరిత రికవరీకి దారితీసే రోబోటిక్ మరియు మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీల తాజా సాంకేతిక ధోరణులపై చర్చ జరిగింది. ఈ సదస్సును ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం, సైన్స్, టెక్నాలజీ మంత్రి సి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. శస్త్రచికిత్సల్లో ఖచ్చితత్వాన్ని పెం చడంలో, ఆధునిక వైద్యసేవలను ప్రజలకు చేరువ చేయడంలో రోబోటిక్ వ్యవస్థల పాత్రను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరే టింగ్ ఆఫీసర్ బిజు నాయర్, డాక్టర్ ఎస్. శాంత కుమారి, డాక్టర్ మంజుల అనగని, డాక్టర్ సుజల్ మున్షి, డాక్టర్ అతుల్ గణత్ర, డాక్టర్ కళ్యాణ్ బర్మాడే పాల్గొన్నారు.
బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ భారతదే శంలో ప్రముఖ రోబోటిక్ గైనకాలజీ శస్త్రచికిత్సల కేంద్రంగా పేరు తెచ్చుకుంది. కేర్ వాత్సల్య ఉమెన్, చైల్డ్ ఇనిస్టిట్యూట్ క్లినికల్ డైరెక్టర్, విభాగాధిపతి పద్మశ్రీ డాక్టర్ మంజు ల అనగాని మార్గదర్శకత్వంలో హిస్టెరెక్టమీ, మైయోమెక్టమీ, ఎండోమెట్రియోసిస్ వంటి ఆధునిక శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డాక్టర్ మంజుల అనగాని మాట్లాడుతూ.. “రోబోటిక్ టెక్నాలజీతో శస్త్రచికిత్సలు మరింత ఖచ్చితంగా, తక్కువ ఇన్వా సివ్గా జరుగుతాయి. ఇది రోగులకు త్వరగా కోలుకునే అవకాశం కల్పిస్తుంది.
మహిళల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం కోసం క్లినికల్ ఎక్సలెన్స్ మరియు నిరంతర అభ్యాసంపై మేము దృష్టి సారిస్తున్నాం” అని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మాట్లాడు తూ.. “కేర్ బంజారా హిల్స్ సాంకేతికత, శిక్ష ణ, సహకార క్లినికల్ విధానాల ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణను మరింత ముందుకు తీసుకెళ్తోంది” అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష రోబోటిక్ సర్జరీ ప్రదర్శనలు, నిపుణుల చర్చలు, అలాగే వైద్యులు, పరిశో ధకులు కలిసే ఆధారాల ఆధారిత సెషన్లు ఉన్నాయి.