calender_icon.png 2 October, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తి పరివర్తన పరిశ్రమే ఆర్‌ఎస్‌ఎస్

02-10-2025 12:00:00 AM

జిన్నారంలో ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ శతజయంతి వేడుకలు

జిన్నారం, అక్టోబర్ 1:వ్యక్తి పరివర్తన చెందితేనే సమాజం పరివర్తన చెందుతుందని, వ్యక్తి పరివర్తన పరిశ్రమే ఆర్‌ఎస్‌ఎస్ అని ఆర్‌ఎస్‌ఎస్ సంగారెడ్డి జిల్లా ప్రముఖ వ్యక్త నర్సింలు అన్నారు. జిన్నారం లో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతజయంతి వేడుకలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్ ఎస్ ఎస్ సంస్థ స్థాపించి నేటికి వంద సంవత్సరాలు పూర్తవుతున్నాయని తెలిపారు.

సంస్థ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సమాజ పరివర్తనకు, అదేవిధంగా దేశ సేవలో ముందుంటుందని తెలిపారు. భారత మాత ముద్దు బిడ్డలైన మనం భారత జాతి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వ్యక్తి పరివర్తన నుండి కుటుంబ పరివర్తనం, కుటుంబ పరివర్తనం నుండి సమాజ పరివర్తన, సమాజ పరివర్తన నుండి భారత జాతి పరివర్తనం చెందుతుందని తెలిపారు.

అనంతరం ముఖ్య అతిథిలు మండల హిందూ జాగరణ సమితి అధ్యక్షులు ఆనంద్ చారి, వివేకానంద పాఠశాల ప్రిన్సిపాల్ కరుణసాగర్ రెడ్డి లు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కార్యక్రమంలో హిందూ జాగరణ సమితి ప్రధాన కార్యదర్శి టెంట్ శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు బ్రహ్మేందర్ లు సభ్యులు పాల్గొన్నారు.