19-07-2025 12:05:24 AM
రివార్డులు అందజేసిన రీజియన్ మేనేజర్ శంకర్ నాయక్
ఎల్బీనగర్, జులై 18 : ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందిస్తేనే ఆర్టీసీ సంస్థ అభివృద్ధి బాటలో కొనసాగుతుందని డిప్యూటీ రీజినల్ మేనేజర్ శంకర్ నాయక్ అన్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధి బాటలో నడవాలంటే ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యతగా సంస్థ నాది అనే దృఢ సకల్పంతో పని చే స్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. ఉత్త మ ఫలితాలరతో ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని శంకర్ నాయక్ పేర్కొన్నారు.
హయత్ నగర్ -1 డిపో మేనేజర్ విజయ్ అధ్యక్షతన శుక్రవారం ఆదర్శ ఉద్యోగుల అభి నందన సభ నిర్వహించారు. ఈ సందర్భం గా శంకర్ నాయక్ మాట్లాడుతూ... ప్రభు త్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని, సంస్థ ప్రవేశపెట్టే నూతన పథ కాలను వారధిగా ఉంటూ వాటిని విజయవంతం చేయాలన్నారు.
ఇందన పొదుపులో డ్రైవర్లు, అత్యధిక ఆదాయం తెచ్చిన కండక్టర్లు, బస్సు మెయింటనెన్స్ లో ప్రతిభ కన పర్చిన గారేజీ సిబ్బందికి నగదు పురస్కారా లు, ప్రశాంస పత్రాలను డిప్యూటీ రీజినల్ మేనేజర్ శంకర్ నాయక్ అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిపాల్గొన్నారు.