calender_icon.png 9 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెల్లి సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేశాం

09-12-2025 01:44:30 AM

  1. మంది పైసలకు కాంగ్రెస్  మంగళ హారతులు పడుతుంది

మండలం చేశాం..సాగు, తాగునీరు అందించాం

మాజీ మంత్రి సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి 

వనపర్తి, డిసెంబర్ 8 (విజయక్రాంతి) : రెవెల్లి సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేశామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.  సర్పంచ్ ఎన్నికలలో బాగంగా సోమవారం రెవెల్లి మండల కేంద్రంతో పాటు కొంకలపల్లి, బండ రవిపాకుల గ్రామాల బి.ఆర్.ఎస్ బలపరిచిన అభ్యర్థులు పబ్బతి, పర్వతాలు, పెద్దముక్కల లక్ష్మీ, శ్రీరాములు తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు రెవెల్లి ఒక మూలకు విసిరేసిన గ్రామములో ఉండేదని తాను ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులుగా, మంత్రిగా రెవెల్లి సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేశామన్నారు.రెవెల్లినీ మండలం చేయడం, ఒక్క గజం భూమి కూడా ఎండకుండా సాగు, తాగు నీరు అందించామని కె.జి.బి.వి పాఠశాల, కళాశాల ఏర్పాటు చేశామని మండలా నికి కావలిసిన అన్ని మౌలిక వసతులు కల్పించామని అన్నారు.

చేసిన అభివృద్ధినీ కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఆది వారి చేతకాని తనానికి నిదర్శనం అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం నుండి ఊరి బయటి వరకు  కోటి రూపాయలతో సి.సి డబల్ రోడ్ మంజూరు చేయిస్తే ఆది వేయ డం మాని నిధులు కాంగ్రెస్ నాయకులు దారి మళ్లించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బోర భీమన్న, శివరామ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ ఛైర్మెన్ పలుస రమేష్ గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.