calender_icon.png 30 January, 2026 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త కనిష్ఠానికి రూపాయి

05-12-2024 12:00:00 AM

84.75 స్థాయికి కరెన్సీ విలువ

ముంబై, డిసెంబర్ 4: క్రితం రోజు కొంతకోలుకున్న రూపాయి బుధవారం తిరిగి కొత్త కనిష్ఠస్థాయికి పతనమయ్యింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో  (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ 7 పైసలు నష్టపోయి రికార్డు కనిష్ఠస్థాయి 84.75 వద్ద ముగిసింది.

ఇప్పటివరకూ డిసెంబర్ 2న 84.72 రికార్డు ముగింపుకాగా, అంతకంటే దిగువస్థాయిలో బుధవారం క్లోజయ్యింది. ప్రపంచ మార్కెట్లో యూఎస్ డాలరు బలపడటం, క్రూడ్ ధరలు పెరగడం దేశీ కరెన్సీని దెబ్బతీశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. డాలర్ ఇండెక్స్ 106.47 స్థాయికి, బ్రెంట్ క్రూడ్ ధర 72 డాలర్ల స్థాయకి పెరిగాయి.

వచ్చే కొద్ది రోజుల్లో రూపాయి 84.50 శ్రేణిలో కదలవచ్చని అంచనా వేస్తున్నట్లు మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు.