calender_icon.png 12 July, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

12-07-2025 01:55:33 AM

  1. చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి 
  2. గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి,జులై11(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తోందని,చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానాని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి, కురిక్యాల, గట్టుభూత్కూర్ గ్రామాల్లో రూ. 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.

ఒద్యారం మాజీ సర్పంచ్ మూలుకుంట్ల సంపత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలకు 43 ఇంచెస్ టీవీ, వాటర్ ప్యూరిఫైయర్, బీరువా, విద్యార్థులకు షూలు, స్పోరట్స్ డ్రెస్ లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పాఠశాలకు అందజేయించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూగత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హాయంలో పల్లెల్లో అభివృద్ధి జరగక వెనుకబాటుకు గురైనాయన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య, బుర్గు గంగన్న , అజయ్ రావు,రోమల రమేష్, సాయి గౌడ్, గుజ్జల బాపు రెడ్డి, పడిత పల్లి కిషన్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.