calender_icon.png 30 January, 2026 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైటిల్ పోరుకు సబలెంకా, రిబకినా

30-01-2026 12:00:00 AM

మెల్‌బోర్న్, జనవరి 29 : అస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో రసవత్తర టైటిల్ పోరు అభిమానులను అలరించబోతోంది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సబలెం కా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆమె ఎలినా స్విటోలినాను వరుస సెట్లలో చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో స్విటోలినా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా సబలెంకా 6-3,6-3 స్కోర్‌తో గెలిచి నాలుగోసారి గ్రాండ్‌శ్లామ్ ఫైనల్‌కు చేరుకుంది. ఓపెన్ ఎరాలో గూలాగాంగ్, మార్టినా హింగిస్ తర్వాత వరుసగా 4 గ్రాండ్‌శ్లామ్ ఫైనల్స్‌కు చేరిన మూడో ప్లేయర్‌గా రికార్డులక్కెంది.

ఉత్కంఠభరితంగా సాగిన మరో సెమీస్‌లో రిబకినా 6-3,7-6 స్కోర్‌తో జెస్సికా పెగులాపై విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న రిబకినాకు తర్వాతి సెట్‌లో మాత్రం గట్టిపోటీ ఎదురైంది. ఇద్దరూ సర్వీసులు నిలబెట్టుకోవడంతో టై బ్రేక్ తప్పలేదు. చివరికి టై బ్రేక్ కూడా హోరాహోరీగానే సాగింది. అయితే 15వ పాయింట్ దగ్గర బ్రేక్ సాధించిన రిబకినా పైచేయి సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగే టైటిల్ పోరులో రిబ కినా, సబలెంకా తలపడున్నారు.