19-09-2025 01:11:14 AM
సీఎస్‌కు టీజీఈజేఏసీ నేతల వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : తెలంగాణలో ప్రతి సంవత్సరం మహిళలు సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారని, ఈ నెల 30న జరిగే సద్దుల బతుకమ్మ పండుగ రోజును సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు. ఈ మేర కు గురువారం సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు కటకం రమేష్, ఏ.సత్యనారాయణ, ముజీబ్, శ్యామ్, రామారావు, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్, హరికృష్ణ పాల్గొన్నారు.