calender_icon.png 19 August, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ శంకుస్థాపన దినోత్సవం

11-12-2024 01:12:25 AM

  1. 70వ వసంతంలోకి నాగార్జునసాగర్ 
  2. రాతితో ప్రపంచంలో నిర్మించిన ప్రథమ ప్రాజెక్టు

నల్లగొండ, డిసెంబర్ 10 (విజయక్రాం తి): నాగార్జున సాగర్ శంకుస్థాపన దినోత్సవాన్ని మంగళవారం డ్యామ్ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాడు శంకుస్థాపన సమయంలో వేసిన స్తంభాన్ని పువ్వులతో అందంగా అలంకరించి పూజలు చేశారు.

డ్యామ్ నిర్మాణ సమయంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన మీర్ జాఫరల్ లీ విగ్రహానికి, అమరులైన కార్మికుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శంకుస్థాపన స్తంభం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో డ్యామ్ ఎస్‌ఈ శ్రీధర్‌రావు మాట్లాడారు. ఎంతో మంది శ్రమజీవుల నిస్వార్థానికి ప్రతీక నాగార్జున సాగర్ డ్యామ్ అని ఆయన పేర్కొన్నా రు.

ఇంత గొప్ప ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందిపై ఉందన్నారు. ఈఈ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. ఈ ఏడాది సాగర్ పూర్తిస్థాయిలో నిం డటంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈలు నరసింహ మూర్తి, కృష్ణయ్య, సత్యనారాయణ, ఎస్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ రఘుబాబు, ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు. 

ఆధునిక దేవాలయానికి 69 ఏండ్లు పూర్తి.. 1954 లో పునాది రాయి

ప్రపంచంలోనే అనేక అద్భుతాలకు నెలవైన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాప న చేసి నేటికి (డిసెంబర్ 10,1955) 70 ఏండ్లు. భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతలు మీదుగా పునాది రాయి పడింది. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు ప్రముఖ ఇంజినీర్ కేఎల్ రావు, ముత్యాల జమీందార్ మహేశ్వర ప్రసాద్‌రావు ఆలోచనే మూలం. సుమారు 12 ఏం డ్ల పాటు 45 వేల మంది కార్మికులు నిరంతరం పని చేశారు.

మొత్తం 19 కోట్ల 71 లక్షల మంది ఈ మహాయజ్జంలో పాల్పంచుకోవడంతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రాతి కట్టడ నిర్మాణం సాధ్యమైంది. 1967 ఆగస్టు 4న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 1970 నాటికి డ్యామ్ పూర్తిగా నిర్మాణం కాగా 1974లో 26 రేడియల్ క్రస్టుగేట్లను అమర్చారు.

నాటి నుంచి నేటి వరకు 24 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ ఆంధ్ర, తెలంగాణకు అన్నపూర్ణగా మారింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తూ జీవనాడి అయ్యింది. సాగర్ డ్యామ్ నిర్మాణానికి నాడు రూ.132 కోట్లకుపైగా ఖర్చయ్యిందని అంచనా. ఇప్పుడైతే లక్షల కోట్లు వెచ్చించినా సాధ్యం కాదన్నది నిపుణు ల అభిప్రాయం. ప్రపంచంలోనే అతి పెద్దయిన మానవ నిర్మిత కట్టడం సాగర్.

కాల్వ నిర్మాణంలో పని చేశా

నాడు నాలాంటి లక్షల మంది పని చేయడంతో సాగర్ ప్రాజెక్టుతోపాటు కాల్వల నిర్మాణం సాధ్యమైంది. అప్పట్లో కూలీలకు రోజుకు రూ.25 పైసలు, మేస్త్రీకి అర్ధ రూపాయి చెల్లించేవారు. ఏ ఒక్కరూ నాడు కూలి పని అనే ధోరణిలో వెళ్లలేదు. నీళ్లొస్తే భవిష్యత్ బతుకులు బాగుపడతాయి.. అందరికీ అన్నం దొరుకుతుందనే ఆలోచనతోనే వెళ్లాం. 

 చింతపల్లి జయమ్మ, 

త్రిపురారం మండలం