10-05-2025 01:41:02 AM
నిజామాబాద్, మే 9 (విజయ క్రాంతి): దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛ నెరవేర ఉంది. జాతీయ రహదారి 63 నువ్వు అభివృద్ధి పరుస్తూ నాలుగు లైన్ల రహదారిగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ కృషి మేరకు పనులు ప్రారంభం కానున్నాయి. మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల హైవే నిర్మాణానికి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది. చాలా కాలం నుంచి ఉన్న ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుంది.
దీనికి సంబంధించి త్వరలో టెండర్లు ఆహ్వానించి మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎన్ హెచ్ 63 నీ నాలుగు లైన్లుగా విస్తరించి, పట్టణాలు మరియు గ్రామాల దగ్గర బైపాస్ నిర్మించబోతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి అవడానికి రూ.3,850 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్న కలలు త్వరలో నెరవేరబోతున్నాయి.
ఏళ్ల తరబడి ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతానికి చెందిన ప్రజలు ఎదురుచూస్తున్న హైవేకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా ఈ రోడ్డు నిర్మాణానికి వీలుగా ఉండే విధంగా అటవీ మరియు పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. దాంతో త్వరలో టెండర్లు పిలిచి నిర్మాణ పనులను చేపడతారు. మరో మూడు ఏళ్లలో ఈ హైవే పూర్తవుతుందని తెలుస్తుంది.
ఎన్ హెచ్ 63 ప్రస్తుతం రెండు వరుసలుగా ఉంది. ఈ దారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో దీనిని నాలుగు లైన్లుగా నిర్మించాలంటే చాలామంది ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. డబుల్ ట్రాక్ రోడ్లో చాలామంది ప్రమాదాలకు గురయ్యారు. నిత్యం ప్రజల రావణ సరుకు రావణా భారీ వాహనాలతో పాటు అనేక వాహనాలు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తాయి.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాలని మరింత అభివృద్ధి చేయాలన్న అధికారుల కృషి ఫలించలేదు. కొన్ని కారణాల వలన అది కార్యరూపం దాల్చలేదు . తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పని ప్రారంభం కానుంది. గత ఎన్నికల్లో పర్యటన నిమిత్తం నిజామాబాద్కు వచ్చిన జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఇచ్చిన హామీ మేరకు జాతీయ రహదారి 63 అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.
దేశంలో ఉన్న కీలక జాతీయ రహదారులలో ఈ రహదారి కూడా ఒకటి. ఎన్ హెచ్ 63 రహదారి మహారాష్ట్రలో దౌండ్ దగ్గర మొదలయ్యి తెలంగాణ రాష్ట్రం, చతిస్గడ్ రాష్ట్రం మీదుగా 1065 కిలోమీటర్లు కొనసాగి ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపూట్ లో ముగుస్తుంది. ఈ రహదారి తెలంగాణ రాష్ట్రంలో బోధన్, నిజామాబాద్, ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాలమీదుగా ఈ రహదారి ఉంటుంది.