calender_icon.png 21 August, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపత్ రాజారాం సేవలు మరవలేనివి

20-08-2025 07:19:43 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): డాక్టర్ ధర్మపురి సంపత్ రాజారాం యాదవ్ సేవలు మరువ లేనివని ఆయన ఆశయాలు కొనసాగిస్తామని మాజీ కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్ అన్నారు. బుధవారం హనుమకొండలోని ఆరేపల్లి ములుగు రోడ్డు ప్రాంతంలో ఉన్న యాదవ్ సంపత్ రాజారాం యాదవ్ విగ్రహాలకు పూలమాలలు వేసి 13వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని భారత్ కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా యువతలో సేవ స్ఫూర్తి, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించారని పేర్కొన్నారు. అనంతరం యువకులు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నయీమ్ నగర్ లో బిసి సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బంక సంపత్ యాదవ్, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, కవాటి కవిత, బొంగు అశోక్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, ఎల్లావుల కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.