calender_icon.png 27 August, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం

27-08-2025 01:35:47 AM

- ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

జగదేవపూర్, ఆగస్టు 26: కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. జగదేవపూర్ మండల పరిధిలోని కొండపోచమ్మ ఆలయ ప్రాంగణంలో బీర్ల ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మంచినీటి జల సౌధను ప్రభుత్వ చీఫ్ విప్, అలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి తో కలిసి మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అమ్మవారి సేవలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని తెలిపారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, ఆలయ పరిసరాలలో ఐమస్ లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా, బీర్ల ఫౌండేషన్ ద్వారా, తమ ఇంటి ఇలవేల్పు కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నారు.

సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటున్నాడని తమకు ఎమ్మెల్యే కెసిఆర్ కాదు హరీష్ రావు అని ఎద్దేవా చేశారు. హరీష్ రావు అంటే పని రాక్షసుడు అని పేర్కొన్నరు. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బయట వ్యక్తులతో కుమ్ములాటలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ తీసుకొని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సిందిగా కోరారు.

అలాగే మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి మాట్లాడుతూ తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా 11 గ్రామాలకు నీళ్లు అందించడానికి కాలువలు తవ్వించాలని, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ పోచమ్మ చైర్మన్ అను గీత, ఈవో రవికుమార్, ఏఎంసీ చైర్మన్లు నరేందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, తీగుల్ నర్సాపూర్ తాజా మాజీ సర్పంచ్ రజిత రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు అజీజ్, మురళి ఆలయ ధర్మకర్తలు, అర్చకులు లక్ష్మణ్,రమేష్ , సిబ్బంది కనుకయ్య, మహేందేర్ రెడ్డి, హరి బాబు తదితరులు పాల్గొన్నారు.