16-06-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 15(విజయక్రాంతి): విశ్వ హిందు పరిషత్ కార్యద ర్శిగా ఆకుల సంతోష్‌ను నియమించినట్లు ధనుంజయ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శిశు మందిర్‌లో ఆదివారం నిర్వహించిన విశ్వహిందూ పరిషత్ సమావే శా నికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడారు.
రానున్న రోజుల్లో హిందూ సమాజంలోని అస్పృశ్యత అంటరానితనం తొల గించి నిమ్న వర్గాలలో చైతన్యం నింపేందుకు సామాజిక సమరసత రథయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జనగామ (ఆసిఫాబాద్) ప్రఖండ కార్యదర్శిగా ఆకుల సంతోష్, సహకారదర్శిగా మురుముర్ వార్ రాజును నియమించారు.
ఈ సమావేశంలో పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, జిల్లా అధ్యక్షులు రేవల్లి రాజలింగు, జిల్లా ఉపాధ్యక్షురాలు గొట్టిపర్తి కనకతార,జిల్లా కార్యదర్శి వేముల రమేష్, విపిన్ లోధా, రాపర్తి నవీన్, వైభవ్, సింహాద్రి, బజరంగ్‌దళ్ జిల్లా సహా సంయోజక్ మురళీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.