19-08-2025 12:00:00 AM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, ఆగస్టు 18 (విజయ క్రాంతి) ః సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ అంకి త్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో..
కామారెడ్డిఆగస్టు 18 (విజయక్రాంతి) ః సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గొట్టుముక్కూల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు చిన్నోళ్ళ లింగ గౌడ్ , సభ్యులు ,కే.పెంట గౌడ్,నారా గౌడ్, చంద్ర గౌడ్, రామగౌడ్, సిద్ధ రాములు శ్రీనివాస్, చిన్న లింగ గౌడ్, మైసగౌడ్ రామస్వామి గౌడ్, అంజా గౌడ్, శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.