14-08-2025 12:51:41 AM
కొత్తపల్లి, ఆగష్టు 13(విజయక్రాంతి):శాతవాహన విశ్వవిద్యాలయం బి.ఎడ్ రెండవ, నాలుగవ సెమిస్టర్ పరీక్షల ప్రణాళికను విడుదల చేసింది. రెండవ, నాలుగవ సెమిస్టర్ పరీక్షలు 14-08-2025 నుండి 29-08-2025 తేదీ వరకు,ఎల్.ఎల్.బి. రెండవ సెమిస్టర్ పరీక్షలు కూడా 14-08-2025 నుండి 25-08-2025 వరకు జరగనున్నట్లు తెలిపారు.
ఇతర వివరాలకు యూనివర్సిటీ వ్బుసైట్లో చూడవలసిందిగా లేదా ఆయా కళాశాలలో సం ప్రదించవలసిందిగా శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు.