calender_icon.png 30 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ అప్‌గ్రేడేషన్ పనులు ప్రారంభం

30-12-2025 12:00:00 AM

చిన్నంబావి, డిసెంబర్ 29 : మండల పరిధిలో పెద్ద దగడ గ్రామ ఉన్నత పాఠశాలలో స్కూల్ అప్గ్రేడేషన్ పనులకు గ్రామ సర్పంచ్ ఉడతల భాస్కర్ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ ఉన్నత  పాఠశాలల్లో సౌకర్యాలు, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, బోధన ప్రమాణాలను పెంచడం వంటి ప్రక్రియ, దీనివల్ల విద్య నాణ్యత పెరుగుతుంది, విద్యార్థులు మెరుగైన విద్య అందుకోవడానికి వీలవుతుంది ఆయన అన్నారు.

ప్రభుత్వాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలైన పి ఎం శ్రీ, సమగ్ర శిక్ష వంటివి ఈ అప్గ్రేడేషన్ కార్యక్రమాలను అమలు  చేస్తూ కొత్త కోర్సులు, డిజిటల్ క్లాస్రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్లు,మధ్యాహ్న భోజన గది పునర్నిర్మాణం, పాఠశాల కాంపౌండ్ గోడలకి ఆకర్షణీయమైన పెయింటింగ్ లు వంటివి పలు రకాల పనులు చేసుకోవచ్చని మండల విద్యశాఖ అధికారి రాజేందర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ నాయకులు, విద్యార్థులు  పాల్గొన్నారు.