09-10-2025 07:35:20 PM
హాజరై మాట్లాడిన సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): ఓటు చోరీపై పలు డివిజన్లలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశ వ్యాప్తంగా చేస్తున్న ఓటు చోరీని అరికట్టడానికి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా అన్ని ప్రాంతాలలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అవుతున్నారని నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో జరుగుతుందని అనుకున్న దానికంటే ఎక్కువ ప్రజల నుంచి స్పందన వస్తుందని నరేందర్ రెడ్డి అన్నారు.
మల్కాపూర్ 16 డివిజన్ లో స్థానిక నాయకుడు బొమ్మ ఈశ్వర్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కాశీపాక శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మడుపు మోహన్, శ్రవణ్ నాయక్, పండుగ సాయి, కొక్కు సందీప్, గొర్రె పోచమల్లు, బొమ్మ సత్యనారాయణ, తొర్తి శ్రీనివాస్, కాసారపు ఎల్లాగౌడ్, తొర్తి మహేష్ తదితరులు పాల్గొన్నారు. 20వ ఇందిరమ్మ కాలనీలో ఆస్తాపురం రమేష్, లత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆస్తా పురం తిరుమల, పర్వతం మల్లేశం, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.