calender_icon.png 4 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల్లో భద్రతా చైతన్యం పెంచాలి

04-12-2025 12:00:00 AM

రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కర్నూలు దుర్ఘటన మరువకముందే చేవెళ్ల వద్ద జరిగిన మరో ప్రమానం, ఆ తర్వాత పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఐదు బస్సు ప్రమాదాలను చూసుకుంటే.. ఇది కేవలం దురదృష్టకర ఘటనలు మాత్రమే కాకుండా నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.. రహదారి మౌలిక వసతుల లోపాలు, అతివేగం, ఓవర్ లోడింగ్, డ్రైవర్లకు శిక్షణ లోపం, పథకాల ప్రభావం. ఇవన్నీ కలిసి భద్రతను తుంచేస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమే. అంతేకాదు, రహదారి రూపకల్పనలో లోపాలు, తప్పుడు ప్రాజెక్టు నివేదికలు, ఇంజనీరింగ్ వైఫల్యాలు, నిర్లక్ష్య పర్యవేక్షణ, అధికారులు అప్రమత్తంగా లేకపోవడం లాంటివే నిజమైన హంతకులు.

హైవేల బ్లాక్‌స్పాట్లను సరిదిద్దడంలో యంత్రాంగం విఫలమైంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కో వాలి. డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. లైసెన్స్ ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వాలు.. మీడియా, విద్యా సంస్థల ద్వారా ప్రజల్లో భద్రతా చైతన్యం పెంచాలి.

 కుమారస్వామి, వలిగొండ