calender_icon.png 29 May, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందించాలి..

27-05-2025 08:12:54 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం..

మునుగోడు (విజయక్రాంతి): ఖరీఫ్ సాగు కోసం రైతులకు అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచి, సబ్సిడీపై అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం(CPM District Secretary Group Member Banda Srisailam) ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి, వ్యవసాయ క్యాలెండర్ ప్రకటించి గ్రామాలలో పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో పంటలవారీగా ప్రణాళికను రూపొందించాలని, రైతులకు అన్ని రకాల ఎరువులను, పురుగుల మందులను సబ్సిడీపై అందించాలని కోరారు.

భూమి పాసు పుస్తకం కలిగిన ప్రతి రైతుకు ఖరీఫ్ సాగు కోసం పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ పంట సాగు కోసం ప్రభుత్వం రైతు భరోసా ను పాస్ బుక్ కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా నగదును బ్యాంకుల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసాను వెంటనే అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న భూభారతి అమలుకు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యమును అమ్మిన రైతులకు వెంటనే రైతు ఖాతాలలో డబ్బులను జమచేసి అన్ని రకాల ధాన్యముకు ప్రభుత్వ ప్రకటించిన బోనస్ ను ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, వడ్లమూడి హనుమయ్య, కట్ట లింగస్వామి, ఎట్టయ్య ఉన్నారు.