calender_icon.png 4 December, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నతాధికారుల నియామకాలు

03-12-2025 12:00:00 AM

మంత్రి పురోహితాది భృత్యవర్గం, అధ్యక్షప్రచారం, పురుషద్రవ్య ప్రకృతివ్యసన ప్రతీకారమ్, ఏధనం చ రాజైవ కరోతి!

(కౌటిలీయం 8): మంత్రి పురోహితాది భృత్యవర్గాన్ని, ప్రధానాధికా రులను, విభాగాల అధ్యక్షుల నియామకాలను, జనపద కోశాలను, రాజ్యాభివృద్ధిని రాజే నిర్వహిస్తాడు. ఎవరిని పూజించాలో, ఎవరిని శిక్షించాలో రాజే జాగ్రత్తగా నిర్ణయిస్తాడు అంటాడు, ఆచార్య చాణక్య. రా జ్యమైనా, సంస్థయైనా నాయకుని ప్రతిభావ్యుత్పత్తులపైనే ఆధారపడి ఉంటుంది. అ భివృద్ధిలోనైనా, ప్రమాదంలోనైనా నా యకుడు ఎలా ఉంటే అధికారులు అలాగే ఉంటారు.

నాయకునికి దగ్గరగా ఉండి మంత్రాంగాన్ని చెప్పేవాడు, మంత్రి (CEO). చెప్పిన కార్యాలను నిర్వహించేవాడు, అమాత్యుడు (COO), అంటాడు చాణక్య. అభ్యుదయ సాధన నిరంతర పక్రి య. అంతర్గత దార్శనికత వెలుగుచూస్తే బాహ్య పరిమితుల పరిధులు చెదిరిపోతాయి. అలవాటయిన పాత ఆలోచనల ను, విధానాలను అనుసరిస్తే.. పాత ఫలితాలే పునరావృతమౌతాయి.

కొత్త ఆలోచ నలు, విధానాలు కొత్త ఫలితాలను ఆవిష్కరిస్తాయి. కొత్తను ఆదరించలేకపోవడమం టే అరచేతిలో నీటిని నింపుకోవడమే. చదువుకున్నాము, ఉద్యోగం వచ్చింది.. ఉద యం లేస్తాము.. కార్యాలయానికి వెళ్తా ము.. సాయంత్రం వస్తాము.. టీ.వీ. చూస్తా ము.. కుటుంబంతో, మిత్రులతో సరదాగా గడిపేస్తాము.. నిద్రిస్తాము.. అదే విధానం లో మరొకరోజు గడుస్తుంది.. నెలకొకమా రు జీతం వస్తుంది..

అవేఖర్చులు.. నెలాఖరుకు అప్పులు.. గానుగెద్దు జీవితం. పాత ఆలోచనలు.. పాత ఫలితాలు.. దానికి బదులుగా ఉద్యోగం వచ్చింది.. ఉదయం వెళ్ళాము.. సాయంత్రం దాకా ఉత్సాహం తో శ్రమించాము. ఇంటికి వచ్చాము.. గం టా రెండు గంటలు కొత్త నైపుణ్యాలను నే ర్చుకుంటాము. వాటిని పని స్థలంలో ఉపయోగిస్తాము.. పదోన్నతిని పొందుతా ము.. త్వరలోనే మరొక సంస్థను నెలకొ ల్పుతాము. ఉద్యోగి యజమాని అవుతాడు. కొత్త ఆలోచన.. కొత్త దారిని చూపింది. 

అపజయాలకు కారణాలు..

స్పష్టమైన ఉద్దేశ్యాలు కలిగి, లక్ష్యం ఉదాత్తమైనప్పుడు, ప్రతిభావంతమైన బృ ందాన్ని ఏర్పరుచుకున్న నాయకుడు అ త్యుత్తమ ఫలితాలు సాధిస్తాడు. అయితే ఉన్నతాధికారుల నియామకాల్లో నాయకు డు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బల మైన విత్తనాన్ని భూమిలో నాటి పోషణ చేస్తే.. సంపద పెరుగుతుంది. ఉత్తమ అధికారుల ద్వారానే సంస్థలో ఉత్తమ ఫలితా లు ఆవిష్కృతమౌతాయి.. సంస్థ విస్తరిస్తుంది.. సంపద పెరుగుతుంది.

జీవం లేని, బలహీనమైన విత్తనాన్ని నాటినా, విత్తనా న్ని భోంచేసినా అభ్యుదయం కలగదు. అ లాగే.. రాజయినా, సంస్థ అధిపతియైనా త మ కార్యకలాపాలను ప్రభావవంతంగా నిర్వహించుకోవాలి అంటే సమర్ధత, నిబద్ధత, నైపుణ్యం కలిగిన నిర్వహణాధికా రులను నియమించుకోవాలి. సమర్ధత, నిబద్ధత లేని వారిని నిర్వహణాధికారులుగా నియమిస్తే నిస్సారమైన ఫలితాలు వస్తాయి.

ఉన్నతాధికారులను నియమించే విషయంలో వారి సమర్ధత, నిబద్ధతలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. నిబద్ధత, సమర్ధతలు వ్యక్తుల అలవాట్లను అనుసరించి వెలుగుచూస్తాయే కాని వారి మేధను అనుసరించవు. అప్పగించిన కా ర్యం వరకు మాత్రమే ఆలోచించే నిర్వాహకుల వైఖరి అభ్యుదయానికి మార్గం చూప దు. రేపటి భవితకు ఈ రోజెలా పునాదిని వేసుకోగలననే ఆలోచనయే ఉత్తమత్వానికి దారిచూపుతుంది.. అంతర్గత శక్తిసామర్ధ్యాలను వెలికితీస్తుంది. బాధలను శక్తిగా పరి వర్తన చేసుకునేందుకు ఉపకరిస్తుంది. స్వల్పకాలిక ప్రయోజనాలు ప్రలోభాలకు లొంగిపోతాయి.

ఈ రోజుకు సాధించిన ఫలితాలు చాలనుకునే.. సంతృప్తి ముందు కు సాగనీయదు. భవితను గూర్చిన భయ మూ ప్రగతికి అవరోధమే. ఈ రెంటికీ వాయిదా వేసుకునే జబ్బు తోడయ్యి, అలవాటుగా మారితే.. నిర్వాహకులు తమ అసమర్ధతకు, అపజయాలకు మరొకరిని బాధ్యులను చేస్తారు. తమ తప్పిదాలను కింది వారిపై నెట్టివేస్తారు లేదా అపజయానికి ఏవేవో కారణాలను వెతుక్కుంటారు.  

అర్హతే ప్రాతిపదికగా..

సంస్థలో ఉద్యోగులందరినీ ఒకే గాటన కట్టి పదోన్నతులు ఇవ్వడం సమంజసం కాదు. వ్యక్తి వ్యక్తికీ వైవిధ్యం ఉంటుంది. నిబద్ధత లేని వ్యక్తులు ఒప్పందాలను గౌరవించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉండరు. కాబట్టి అన్నింటికీ సరేనంటారు. నిబద్ధత కలిగిన వ్యక్తులు ప్రతి ఒప్పందాన్నీ గౌరవిస్తారు. కాబట్టి తాము చేయగలిగిన దానిని మాత్ర మే ఒప్పుకుంటారు. కఠినంగా కనిపిస్తారు. సమర్ధత, నిబద్ధత కలిగిన వారికి గుర్తింపు, స్వేచ్ఛ, ప్రేరణ లభిస్తే వారు బాధ్యతను తీసుకుంటారు.

అన్ని వ్యవస్థలను నియంత్రించగలుగుతారు. సంస్థను విజయపథం లో నడిపిస్తారు. సంపదను సృజిస్తారు. ఆశ్రితపక్షపాతం లాంటివి సంస్థను నిర్వీ ర్యం చేస్తాయి. ఉత్తమ ఫలితాలను సాధించిన సమర్ధతను గుర్తించి పురస్కరిస్తే వారి లో ఉత్సాహం, శక్తిసామర్ధ్యాలు ద్విగుణీకృతమౌతాయి. అలాంటి వారికి గుర్తింపు నివ్వకపోతే వారు సంస్థలను విడిచివెళ్లవచ్చు. అవసరమైన చోట అసమర్ధతను శిక్షిస్తే.. వారు సరిచేసుకునే అవకాశం ఉంటుంది.

కార్యనిర్వహణకు మాత్రమే పరిమితమైన వ్యక్తులను అధ్యక్షులుగా చేస్తే వారి నుంచి ఉత్తమ ఫలితాలను ఆశించలేరు. ఊహాశక్తి, సమయాన్ని సద్వినియోగం చేసుకునే నైపుణ్యం, నిరంతర సాధన, పట్టుదల కలిగిన నాయకులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగిస్తే అసాధ్యమనుకున్న ఫలితాలూ సుసాధ్యమౌతాయి.

కార్యనిర్వహణాధికారి బృందాన్ని నిర్వహించాలి, సభ్యుల అర్హత ప్రాతిపదికగా బాధ్య తలు అప్పగించి నడిపించాలే కాని అన్నీ తానే చేస్తానని చేయకూడదు. బృందానికి సహాయకుడుగా ఉండాలే కాని తానే అ న్నింటికీ మూలమై, తన ఆధిక్యతను చాటుకునే విధంగా ప్రవర్తించకూడదు. సభ్యుల కు బాధ్యతలను అప్పగించి ప్రోత్సహించడం ద్వారా మరొకతరం నాయకులు సృజింపబడడమే కాక అధ్యక్షునికీ కొత్తగా ఆలోచించే సమయమూ చిక్కుతుంది.

సమన్వయం అవసరం..

ఒకనాడొక సింహం గుహముందు కూ ర్చొని ఉన్నదట.. ఆ దారిని వెళుతున్న నక్క .. నా గడియారం ఆగిపోయింది.. సమ యం చెప్పమని అడిగిందట. అప్పుడా సిం హం.. సమయం చెప్పకుండా, గడియారాన్ని గుహలోకి తీసుకువెళ్ళి దానిని బా గుచేసి తెచ్చిందట. అలాగే మరికొన్ని జం తువులు సింహం వద్ద తమ వస్తువులను బాగుచేయించుకొన్నాయి. పిదప అవి సింహాన్ని ఇన్ని నైపుణ్యాలెలా నేర్చుకున్నావని అడిగాయట.

దానికి సింహం నవ్వు తూ వాటిని గుహలోనికి తీసుకువెళ్లింది. గుహలో పెద్ద కర్మాగారమే నడుస్తున్నదట. ఎవరెవరి సామర్ధ్యాన్ని అనుసరించి వారిని బృందాలుగా ఏర్పరచి, పని కల్పిం చి అందరినీ సమన్వయ పరుస్తున్నది సింహం.

ఇక్కడ చిన్న అంశాన్ని గుర్తించాలి. ఉత్తమ ఫలితాలను సాధించగలిగిన సమర్ధత, నిబద్ధత కలిగిన వారిలో బృం దంగా పనిచేసే అలవాటు తక్కువగా ఉం టుంది. సమర్ధత, నిబద్ధత కలిగి బృం దంగా పనిచేయగలిగిన వ్యక్తులను గుర్తించి సమన్వయంతో పనిచేయించు కోవడంలోనే నాయకుని ప్రతిభ వెలుగు చూస్తుంది.

వ్యాసకర్త: పాలకుర్తి రామమూర్తి