calender_icon.png 22 November, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగుకు రూ.72 వేల కోట్లు

26-07-2024 04:37:58 AM

బడ్జెట్‌లో 25 శాతం వ్యవసాయం, అనుబంధ రంగాలకే..

  1. గతేడాది కేటాయింపులు రూ.49 వేల కోట్లే
  2. ప్రధానమంత్రి ఫసల్ బీమాలో చేరేందుకు అంగీకారం
  3. వరి రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రేవంత్ సర్కార్ సింహభాగం నిధులు కేటాయించింది. అన్నదాత ఆనందంగా ఉంటే రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందనే సంకల్పంతో బడ్జెట్‌లో ఎవుసానికి పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో ఏకంగా 25 శాతం వ్యవసాయ, సాగు అనుబంధ రంగాలకు కేటాయిస్తున్నట్లు  ప్రకటిం చింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ చాటుకోవడంతో పాటు రైతు పక్షపాత సర్కార్ అని మరోసారి నిరూపించుకుంది. బడ్జె ట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క.. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మాటలను ప్రస్తావిస్తూ అన్నదాతకు అగ్రస్థానం కల్పి స్తున్నట్లు చెప్పారు.

మొత్తం రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్‌లో సాగుకు రూ.72, 659 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇది రైతుల తలరాతలు మార్చే చారిత్రక నిర్ణయమన్నారు. గతే డాది బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.49,383 కోట్లు కేటాయించగా ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులను పెంచింది. రైతు భరోసా సహా ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని, బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదని, విలువలు, ఆశల వ్యక్తీకరణతో కూడి, జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ ఏడా దిలో రైతు కూలీలకు రూ.12 వేలు అందించే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు, పీఎం ఫసల్ బీమా యోజనలో చేరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. వరి రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని, ఆయిల్ పామ్ సాగు రైతులకు సహకారం అందిస్తామన్నారు. ధరణి పోర్టల్ ద్వారా వచ్చే సమస్యల కోసం ఒక కమిటీని వేశామని, అధ్యయనం పూర్తయ్యాక సరైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 

పాడికి రూ.1,980 కోట్లు

పాడి పశువుల పెంపకం గ్రామీణ ప్రజానీకానికి ఆర్థిక పరిపుష్టినిస్తుందని భట్టి అన్నారు. పాలు, మాంసం, గుడ్డు పోషణతోపాటు అదనపు అదాయం ఇస్తుందన్నారు. పాల ఉత్పత్తి రంగంలో 62 శాతం వాటా చిన్న, సన్నకారు, భూమిలేని పేదలే ఉంటారని తెలిపారు. 326.36 లక్షల పశుసంపదతో దేశంలో 8వ స్థానంలో రాష్ట్రం ఉందన్నారు. ఈ రంగానికి తాజా బడ్జెట్‌లో రూ.1,980 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌లో ప్రజా పంపిణీ శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించింది.