09-09-2025 12:15:16 AM
నియోజకవర్గంలో విద్యావవృద్ధికి 650 కోట్లు ఖర్చు చేశాం
వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి
పెబ్బేరు రూరల్, సెప్టెంబర్ 08 : వనపర్తి శాసనసభ్యులు తూడిమేఘారెడ్డి సోమవా రం పెబ్బేరు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కంచిరావుపల్లి తండాలో నూతనంగా నిర్మించి న గ్రామపంచాయతీ భవనాన్ని, గ్రామంలో ఆలయ నిర్మాణానికి సొంత నిధులు రెండు లక్షలను విరాళంగా ఇచ్చారు.
పెబ్బేరు మం డల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 45 లక్షల ఖర్చుతో తరగతి గ దుల నిర్మాణంతో పాటు డైనింగ్ హాల్ ని ర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ మో డల్ గృహాన్ని ప్రారంభించారు. పాత సూ గురు, కొత్త సూగుర్ గ్రామాలలో హైమాస్ లైట్లను ప్రారంభించి, ఉన్నత పాఠశాలను సందర్శించారు.
కొత్త సూగురు మరియు పెంచికలపాడు గ్రామాలలో నూతనంగా ని ర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రా రంభించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వనపర్తి నియోజకవర్గంలో నేటికీ 1759 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. విద్యా, వైద్యం తో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రేషన్ బి య్యం లాంటి పథకాలు రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి అందుతున్నాయని సంతోష వ్యక్తం చేశారు.
రానున్న స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధి ఇంతకింత పెరిగేలా చేసుకోవాలని వారు నాయకులకు కా ర్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో వనపర్తి హౌసింగ్ డిఈ విటోబా, పెబ్బేరు వ్యవ సాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గౌని కోదండరామిరె డ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజే ష్, పెబ్బేరు పట్టణ అధ్యక్షులు వెంకట్రాము లు, సీనియర్ నాయకులు రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, దయాకర్ రెడ్డి, వెంకటరమణ, వెంకటేష్ సాగర్, సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ ఎంపీపీలు, పట్టణ కౌ న్సిలర్లు, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.