09-09-2025 12:18:13 AM
ఎల్ హెచ్ పిఎస్ నగార భేరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య రాంమూర్తి నాయక్
మరిపెడ, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): గిరిజన తెగల మధ్య గొడవలు సృష్టిస్తున్న తెల్లం వెంకట్రావు, సోయం బాబురావులను పార్టీ నుండి తొలగించాలని ఎల్ హెచ్ పిఎస్ నంగార భేరి మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య రాంమూర్తి నాయక్ డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన మరిపెడ మండల కేంద్రంలో భూక్య సుధాకర్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గిరిజన తెగల మధ్య గొవడలు సృష్టిస్తున్న తెల్లం వెంకట్రావు, సోయం బాబురావులను వెంటనే పార్టీ నుండి తొలగించాలన్నారు. సోయిలేని బాబురావు నీవు ఎప్పుడైన రాజ్యాంగం చదివినావా, చదివి ఉంటే ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టరన్నారు.
సొంత రాజకీయ లాభాల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తారా అని ప్రశ్నించారు. మా వేషధారణ, భాషా యాస, సంప్రదాయాలను చూసి అనేక పోరాటాలు చేసిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీలుగా గుర్తించి రిజర్వేషన్ కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య సూక్యానాయక్, సురేష్ నాయక్, సోమ్లా నాయక్, లచ్చిరాం నాయక్, హరి నాయక్, సంధ్యా నాయక్, దామ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.