22-01-2026 12:56:37 AM
విద్యాశాఖ పై విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్
నారాయణపేట.జనవరి,21(విజయక్రాంతి) : గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాలు మెరుగ్గా రావాలని ఉపాధ్యాయుల కృషి, పాఠశాల స్థాయి పర్యవేక్షణ ఉత్తమ ఫలితాల సాధన కు కీలకం అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ పై కలెక్టర్ నేతృత్వంలో విస్తృత సమావేశం కొనసాగింది.ఈ సమావేశంలో ఎఫ్ ఎల్ ఎన్ పనితీరును తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బేస్లైన్ నుండి మిడ్ లైన్ వరకు ఫలితాలలో జిల్లా ర్యాంకు 5 స్థానాలు పడిపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎంఈవో లు, జీ హెచ్ ఎం లు టార్గెట్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎఫ్ ఎల్ ఎస్ మార్క్ టెస్ట్కు సంబంధించి మండలాల వారీ సమాచారాన్ని సేకరించి, తదుపరి సమీక్షలో అంశాల వారీగా విశ్లేషణ జరపనున్నట్లు తెలిపారు.ఎల్ ఐ పీ ( Learning Improvement Program) డేటాను పాఠశాలల వారీగా వెంటనే వంద శాతం పూర్తిచేయాలని ఆదేశించారు.అవసరమున్న పాఠశాలల్లో వాలంటీర్లను జిల్లా విద్యా శాఖ కార్యాలయం ద్వారా సమన్వయం చేసుకొని వినియోగించుకోవచ్చని సూచించారు. కొన్ని పాఠశాలల్లో వాలంటీర్ల సహకారం మంచి ఫలితాలు ఇస్తోందని తెలిపారు.
జిల్లాలో అమలవుతున్న యంగ్ ఓరోటర్ క్లబ్, ఫైనాన్స్ లిట్రసి, ఇన్ క్వాలియాబ్ ఫౌండేషన్, ఫ్యూచర్ డాట్స్, వేదిక్ మ్యాస్ వంటి కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా కొనసాగించాలని సూచించారు. నూతన పద్ధతులు విద్యార్థుల ఆత్మవిశ్వాసం మరియు ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయని చెప్పారు.ఖాన్ అకాడమీ రిజిస్ట్రేషన్లు వంద శాతం పూర్తి చేయాలని, ఇంటి ప్రాక్టీస్పు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.
డిజిటల్ లెర్నింగ్ ఇప్పుడు ఒక అవసరం అని అన్నారు.ఎస్ ఎస్ సీ మొదటి స్లిప్ టెస్ట్ ఫలితాలను పాఠశాలల వారీగా, సబ్జెక్టుల వారీగా విశ్లేషించగా గణితం, సైన్స్, ఇంగ్లీష్ వంటి విషయాల్లో కొన్ని పాఠశాలల్లో బలహీనతలు గుర్తించబడ్డాయనీ ఫలితాల మెరుగుదలకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. బలహీన విద్యార్థుల హ్యాండ్హోల్డింగ్ , మార్నింగ్ వేకప్ కాల్స్ హెడ్ ఆప్షన్ వినియోగం, అటెంప్ట్ బేస్డ్ ప్రాక్టీస్, అభ్యాస దీపిక వినియోగం పైతల్లిదండ్రుల అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు.అటెంప్ట్ కల్చర్ పెరిగితే పదో తరగతి ఫలితాలు సహజంగానే మెరుగవుతాయన్నారు.
ఎఫ్ ఎల్ ఎన్ -- ఏ ఎక్స్ ఎల్ ప్రోగ్రాం కొడంగల్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతున్నందున, కంప్యూటర్ వినియోగాన్ని పెంచి అభ్యాస ఫలితాలు మెరుగుపర్చాలని సూచించారు.రాబోయే ఫిబ్రవరి 26, 2026 న రాష్ట్ర స్థాయి ఎఫ్ ఎల్ ఎస్ లో నారాయణపేట జిల్లా మొదటి స్థానం సాధించేందుకు లక్ష్యం నిర్దేశించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ విద్యా శాఖ విశ్రుత సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, ఏ ఎం వో విద్యాసాగర్, సీఎంవో రాజేంద్రకుమార్, ఏఎస్ సీ శ్రీనివాస్, అన్ని మండల విద్యాధికారులు ,ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.