calender_icon.png 29 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన

29-12-2025 12:41:23 AM

నారాయణఖేడ్, డిసెంబర్ 28 :నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీరామ మందిరంలో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఈ శిబిరంలో మొత్తం 51 మం ది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు అయ్యప్ప గురుస్వామి కోస్గికర్ శివానంద్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ సేవే లక్ష్యంగా అయ్యప్ప సేవ సమితి ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని తెలిపా రు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకర్త, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి. ఓం ప్రకాష్, నాగిరెడ్డి,పాండు, మధుసూదన్ రెడ్డి ,సంజయ్ ప్రసాద్ , సుబ్బారెడ్డి , భూమయ్య ,దత్తు, సంగప్ప, వంశీ , నాగిరెడ్డి, మదన్ లాల్ ఇతర స్వాములు పాల్గొన్నారు.