calender_icon.png 23 November, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ విగ్రహం అపహరణ

10-02-2025 01:31:23 AM

జుక్కల్, ఫిబ్రవరి 9 ః కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం శక్తి నగర్ జంక్షన్ వద్ద గతంలో ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహం శనివారం రాత్రి అపహరణకు గురైంది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జుక్కల్ మండలం డోన్గావ్ నుంచి సోపు వెళ్లే దారిలో శక్తి నగర్ టీ జంక్షన్ వద్ద ఆరు సం వత్సరాల క్రితం రెండు ఫీట్ల శివాజీ విగ్రహా న్ని ప్రతిష్టించారు.

గుర్తుతెలియని వ్యక్తులు శివాజీ విగ్రహాన్ని ఆప హారించడంతో పోలీ సులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఎవరో ఉద్దేశ పూర్వకంగానే విగ్రహాన్ని అపహరించా రని వాపోతున్నారు.

సంఘటన స్థలానికి జుక్కల్ ఎస్త్స్ర భువనేశ్వర్ రావు తమ సిబ్బందితో సందర్శించి నిరసన వ్యక్తం చేసిన వ్యక్తులతో మాట్లాడి సముదాయించారు. ఈ సంఘ టనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్‌ఐ హెచ్చరించారు. అనగారిక మైన చర్యగా ఎస్‌ఐ పేర్కొన్నారు.