calender_icon.png 14 October, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాసిరకపు పనులు

14-10-2025 12:34:33 AM

అశ్వాపురం, అక్టోబర్ 13, (విజయక్రాంతి): మండలంలోని పలు గ్రామాల్లో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక స్తోమతలేని లబ్ధిదారులు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంతో కొంతమంది కాంట్రాక్టర్లు నాణ్యతలేని నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో మట్టి ఇటుకలు, తక్కువ సిమెంట్, సరైన ఫౌండేషన్ లేకపోవడం వంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు.

ఇంత భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం పట్ల ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. డిపార్ట్మెంట్ నిజంగా పర్యవేక్షణ చేస్తుందా&? లేక కాంట్రాక్టర్ల ఆధీనంలోనే పనులు సాగుతున్నాయా? అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై అధికారులు తక్షణమే స్పందించి నాణ్యత లేని పనులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.