calender_icon.png 30 December, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో 4 కమిషనరేట్లు

30-12-2025 01:00:48 AM

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని 3 కమిషన రేట్లను విభజించి, నాలుగింటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నది. అందులో హైదరాబాద్, సైబరాబా ద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు ఉన్నాయి. అయితే గతంలో రాచకొండ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాను మినహాయించి, ఎస్పీ జిల్లాగా ఏర్పాటు చేశా రు. అలాగే పలువురు ఐపీఎస్‌లను సైతం బదిలీ చేశారు. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్‌బాబు, మల్కాజిగిరి సీపీగా అవినాష్ మహంతి, సైబరాబాద్ సీపీగా రమేశ్‌రెడ్డి, యాదాద్రి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్‌లను నియమించారు.