calender_icon.png 19 September, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్‌లో వంట సిలిండర్ల కొరత

19-09-2025 12:21:41 AM

* సిలిండర్ కోసం బారులుదీరిన వినియోగదారులు

* పండగ వేళ గ్యాస్ తిప్పలు

మెదక్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి):మెదక్ జిల్లాలో మొన్నటి వరకు యూరియా కోసం బారులుదీరిన రైతుల దుస్థితిని చూశాం..తాజాగా గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు సైతం బారులుదీరే పరిస్థితి ఏర్పడింది. పండగ సమీపిస్తున్న తరుణంలో గ్యాస్ తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు. నాలుగు రోజులుగా గ్యాస్ కొరత మూలంగా జిల్లా కేంద్రంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ సిలిండర్లు పెట్టి వినియోగదారులు గురువారం బారులుదీరారు.

బుక్ చేసిన సిలిండర్ ఇంటికి రాకపోవడంతో సుమారు 100 మంది వరకు వినియోగదారులు గ్యాస్ సిలిండర్లతో పాటు ఏజెన్సీ వద్దకు వచ్చి ఉదయం నుంచే క్యూకట్టారు. గంటల పాటు క్యూలో నిలిచిన వినియోగదారులు తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్లు క్యూలో పెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే యూరియా కోసం బారులు తీరిన క్యూ లైన్లు కనిపిస్తున్న తరుణంలో గ్యాస్ కోసం బారులు తీరిన ప్రజలను చూసి షాక్ అవుతున్నారు. లారీల సమ్మె వల్ల గ్యాస్ రాలేదని, కర్నూల్ నుంచి లోడ్ తెప్పిస్తున్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.