19-09-2025 12:22:52 AM
జహీరాబాద్, సెప్టెంబరు 18 :జహీరాబాద్ ఆర్టీవో చెక్పోస్టు వద్ద గల భవాని వైన్స్ లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను ఆరు రోజుల వ్యవధిలో పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ టౌన్ ఎస్ ఐ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 12న ఆర్టీవో చెక్ పోస్టు వద్ద భ వాని వైన్స్ లో దొంగతనం జరిగిందని, అందులో 50వేల రూపాయల నగదుతో పాటు మద్యం బాటిలను ఎత్తుకొని పోయినట్లు తెలిపారు.
గురువారం నాడు పస్తాపూర్ కమాన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పద రీతిలో ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. వారిని పట్టుకుని విచారించగా మొహమ్మద్ జమీలుద్దీన్, మొహమ్మద్ ఫైజుద్దీన్ గుర్తించారు. భవాని వైన్స్లో చోరీ చేసినట్లు వారు ఒప్పుకున్నందున వారిపై కేసు నమోదు చేసి రి మాండ్కు పంపించినట్లు ఎస్త్స్ర వినయ్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుండి రూ.6,700, మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ నర్సింలు, కానిస్టేబుళ్లు అస్లాం, ఓందేవ్, ఆనంద్, హరినేత్ర పాల్గొన్నారు.