calender_icon.png 19 August, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓసీ విస్తరణపై సింగరేణి ఫోకస్

19-08-2025 12:35:32 AM

- ప్రభావిత మూడు గ్రామాల్లో 813 ఎకరాల భూ సేకరణ

-ఎకరానికి రూ.22.50 లక్షల పరిహారం

- వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధికి ఊతం

- 1115.91 హెక్టార్లతో ఓసివిస్తీర్ణణ

- ఈ నెల 20న ప్రజాభిప్రాయ సేకరణ

- ఓసీ విస్తరణతో మణుగూరు ఏరియాకు మహర్దశ 

- పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూపు

మణుగూరు, ఆగస్ట్18,( విజయ క్రాంతి) : బొగ్గు గనులతో ఘనమైన చరిత్ర కలిగిన మణుగూరు ఏరియా ఉత్పత్తి లోను సింగరేణికే తలమానికంగా నిలుస్తుంది. 2016 లో ఏర్పడిన మణుగూరు ఓసీ గని నుండి ఏడాదికి 21లక్షల టన్నుల బొగ్గుని వెలికి తీస్తు న్నారు. గనిజీవితకాలం సమీపిస్తుంఉండటం తో పాటు సమీపం లోనిహెవీ వాటర్ ప్లాం ట్, భద్రాద్రి పవర్ ప్లాంట్ల కు ఇక్కడి నుండే బొగ్గు సరఫరా జరుగుతుంది. దీనికి తోడు సింగరేణి సంస్థ భవిష్యత్ దృష్ట్యా ఈ ఓసీ వి స్తరణ అని వార్యమైంది. దీంతో మణుగూ రు ఓసీ విస్తరణకు వేగంగా సింగరేణి, ప్ర భుత్వ అధికారులు సంయుక్తంగా కసరత్తు ప్రారంభించారు. 

విస్తరణ దిశగా అడుగులు

ఓసీ విస్తరణకు భూసేకరణ కోసం 20 24 ఫిబ్రవరి లో సింగరేణి అధికారులు ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుం డి రెవిన్యూ సింగరేణి అధికారు లు తిర్లాపురం, రామానుజవరం గ్రామల్లో పలుమార్లు గ్రామసభలు నిర్వహించారు. తమ కుశాశ్వత ఉపాధి కావాల్సిందే నంటూ ప్రజ లు పట్టుబట్టారు. దీంతో ఓసీ విస్తరణకు ఆ టంకాలుఏర్పడ్డాయి. తాజాగా ప్రతిపాదిత గ్రామాల ప్రజలు భూసే కరణకు గ్రామ స భల్లో ఆమోదం తెలపడం తో ఓసీ విస్తరణపై ఇటు అధికా రులు, అటు కార్మికుల్లో ఆశలు చిగురిస్తు న్నాయి. ఓసీ విస్తరణకు తిర్లాపు రం, రామానుజవర , మణుగూరులో ఉన్న 109.5 హెక్టార్ల అటవీ భూమితో పాటు రా మానుజవరం నుండి 356.16, తిర్లాపు రం359.34, మణుగూరు నుండి 96.36 ఎకరాలు మొత్తం గా 813.06 ఎకరాల భూ మిని రైతుల నుంచి సేకరిస్తున్నారు.

పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ

ఓసి విస్తరణ పై వ్యవసాయ భూమి సేకరణపైనే దృష్టి సారించగా. నివాసాలు ఎవ రూ కోల్పోవడం లేదు. ఏజెన్సీ చట్టాలనుఅనుసరించి గిరిజనులకు ఎకరాకు రూ 22. 50 లక్షలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.5.50 లక్షలు, పంట పొలాల్లోని చెట్లు, ఇతరాలకు విలువ కట్టి అదనంగా పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిర్ణయిం చారు. గిరిజనేతరులకు, పట్టాలేని వారికి ఎకరాకు రూ.11.2.5 లక్షలు, ఆర్ అండ్ ఆర్ ప్యా కేజీ, ఇతర ప్రయోజనాలు అదించనున్నారు. ఇందుకు గాను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సు మ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు భూ సేకరణ సర్వేను ముమ్మరం చేశారు. పెద్దచెరువు, గోపల్ కుంట, రావిచెట్లుకుంట, బు ర్దవాయికుంట, చెరు వుల డిజైనింగ్ కోసం 17. 77 కోట్లు కేటాయించారు. ఆయా చెరువులను అభివృద్ధి చేయనున్నారు. చెరువు లపై ఆధారపడిన, రిజిస్టర్ అయిన సొసైటీ లో సభ్యత్వం ఉండి ఉపాధి కోల్పోయే వా రికి కుడా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించేందుకు నిర్ణయించారు. 

విస్తరణతో మహర్దశ

ఓసి విస్తరణ అనంతరం ప్రాజెక్టు జీవిత కాలం మరో 16 సంవత్స రాలు పెరిగే అవకాశం ఉందని సింగరేణి అధికారులు అంచ నావేస్తున్నారు. ప్రస్తుతం ఓసి విస్తరించి ఉన్న 668.42 హెక్టార్ల నుండి 1115.91 హెక్టార్ల విస్తరణతో మణుగూరు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సాలీనా 2.10 మి. టన్నుల సామర్థ్యంతోఉత్పత్తిని సాధించనుంది. అలాగే ఓసి ప్రాజెక్టు ద్వారా అటు సింగరేణి కార్మికులతో పాటు సమీప పరిశ్రమలకు తక్కువ ఖర్చు తోనే బొ గ్గు సరఫరా చేయడంతో పాటుగా, సంస్థపై ప్రత్యక్ష, పరోక్షంగా ఆధారపడిన కంపెనీలు, స్థానిక యువతకు, వందలాది కుటుంబాల కు ఉపాధి లభించనుంది.

మరో 20 ఏళ్లు మణుగూరులో సంస్థ తన ప్రస్థానం కొనసాగించి, బొగ్గు ఉత్పత్తితో పాటు సమీప గ్రా మాల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటునందించే అవకాశం లభిస్తుందని తమ కృ షికి తగిన ఫలితం దక్కుతోందని అధికారు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20న జరిగే పర్యావరణ ప్రజాభి ప్రాయ సేకరణ కోసం ఎదు రుచూస్తున్నారు. అన్ని అ నుకున్నట్లుగా పర్యావరణ అనుమతులు రాగానే ఓసి విస్తరణ పనులను ప్రారంభించేందుకుఅధికారులు సన్నద్ధమ వుతున్నారు. మరో వైపు గ్రామాలలో పారదర్శకంగా భూ సేకరణ చేపట్టాలని, బినామీల పేరుతో దళారీల జోక్యాన్ని నివారించాలని, అర్హు లైన వారికే పరిహారం అందజేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.