19-09-2025 12:00:00 AM
మణుగూరు,సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : మండలంలోని ఓ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి తీరు నిత్యం వివాదాస్పద మవుతోం ది. ప్రభు త్వ కార్యాలయంలో కీలక స్థానంలో పనిచేస్తున్న ఆయన కిందిస్థాయి, సిబ్బందిని సొం త పనులకు వాడుకోవడం, చెప్పి నట్లుగా వి నకుంటే పర్సనల్గా తీసుకుంటూ టార్చర్ చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా అదేశాఖ అనుబంధంగా పనిచేస్తున్న ఓ గిరిజన దివ్యంగు ఉద్యోగితో ఆయన కారు తుడిపింన ఘటన తాజాగా వెలుగు చూ సింది.
దీంతో మండల ప్రజలు, గిరిజన సం ఘాలు అధికారి తీరిపై మండి పడుతున్నా రు. అయినా ఆయన మాత్రం నాకారు క్లిన్ చేయాలని ఆ సార్ శాఖకు అనుబంధంగా పనిచేసే ఓ కింది స్థాయి సిబ్బందికి హుకుం జారీ చేయడంతో చేసేది లేక ఆ కార్యాల యం లో ఆయన తరువత పంచాయతి వి ధులను చక్కపెట్టే ఓ అధికారిఅదేశాలతో సదరు చిరు ఉద్యోగిని పురమాయించి కా ర్యాలయ పని సమయంలోనే పెద్ద సార్ కార్ క్లిన్ చేయాలని ఆదేశాలు జారీ చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
దీంతో ఆ చిరు ద్యోగి ఆయన కారును శుభ్రం చేయడం మొ దలుకుని ఇంటి పని వరకు ఆ సార్ సేవలో నే తరించడం గమనార్హం. అంతేగాక ఆ పెద్ద సార్ ఇక బయట శుభకార్యానికి, లేదా ప్రభు త్వ పనులపై బయటకు వెళ్లారంటే కార్యాల యంలోని ఓ మహిళ అటెండర్ ఆయన వెంట ఉండాల్సిందే. కాదంటే... వారికి ఇ బ్బందులే అని ఆ కార్యాలయం లో పని చే స్తున్న సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఆ యన వెంట కదిలితేనే.. అ ప్రకటిత వేతనం తో కూడిన సెలవు. మంజు రువుతుంది ఆ ఆఫీసర్ సిబ్బందిని ఎలాసొంత పనులకు వినియోగిస్తోంన్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
తనికిల పేరుతో చుక్కలు....
ఆయన ఓ అభివృద్ధి అధికారి మండలంలోని గ్రామా ల్లో ఏదో పేరుతో నిత్యం తనిఖీ చేస్తుం టాడు. ప్రతి గ్రామంలో తని ఖీ చేయ డం వరకు బాగానే ఉంది. కానీ అందులోనే అసలు మర్మం ఉంది. తనిఖీ చేసి వెళ్లే ప్పుడు సంబంధిత గ్రామాలకు సం బం ధించిన పంచాయతీ కార్యదర్శు లు సదరు అధికారి డ్రైవర్కు ఫోన్ పే లేదా గూగుల్పేలో పే మెంట్ పంపించాల్సిందే అని పలువురు సె క్రటరీలు చర్చించు కుంటున్నారు . ఆయన మాట వినకపోతే మాకు చుక్కలే అని విస్మ యం వ్యక్తం చేస్తున్నారు.
కార్యాలయంలో ఉండరు..అందుబాటులో లేరు..
ప్రభుత్వ అధికారిని కదా అని ఆయన ఆఫీసులో కూర్చుని టైమ్ కాగానే వెళ్లిపోవడం చేయ రు.. నిత్యం తన మండల పరిధి లోని ఏదో ఒక గ్రామాన్ని తిరుగు తూ, ఓ పంచా యతీకి స్పెషల్ ఆఫీసర్. కానీ తనకు న్న అధికార దర్పణంతో పంచా యతీలను తనిఖీ చేస్తూ ఉంటారు. అలా అని ఆయనే దో స్ట్రిక్ట్ ఆఫీసర్ అనుకుంటే పొర పాటే.. అ క్కడే అసలు కిటుకు ఉంది. తనిఖీలు చేసేది పంచాయ తీల నిర్వహణ సరిగ్గా ఉందో లే దో తెలుసుకో వ డానికి కాదు,
వాళ్ల లొసుగులతో బెదిరించి పంచా యతీ సెక్రటరీల నుంచి డబ్బులు గుంజుకోవడాని కే అని వి మర్శలు వినిపిస్తున్నా యి. ఆయన కు ఏ పంచాయతీ అధికారి అయినా సరే గ్రామా న్ని తనిఖీ చేసి వెళ్లేలోపే ఆయన ముందు ఉండి ఆయన సే వల ను చూడాలని,లే దం టే సదరు పంచాయతీ సెక్రటరీలపై ఏదో ఒ క యాక్షన్ తప్పదు.ఇదంతా మండలంలో ని త్యం అభివృద్ధి పేరిట ఆ అధికారి సాగిస్తున్న అధికార దర్పణం.
మీడియాతో కూడా పెదవి విరుపే..
జిల్లా స్థాయి అధికారులు వస్తే మా త్రం ఆ అధికారి వారీతిలో కూడిన ఫోటోలు, వీడియోలు మీడియాకు ఆయన పేరిట ప్రక టనలు విడు దల చేస్తుంటారు. కానీ అధికారి మాత్రం పత్రిక వార్తలను చూడరు. అదే కార్యా లయంలో పనిచేసే ఓ ఉద్యో గి మాత్రం ఆయన పేరుతోనే జిల్లా అధికారులకు అభివృద్ధి గొప్ప అంటూ పత్రికా కథనాలు చేరవేస్తుంటారు. అక్కడి అధి కారులకు మాత్రం ఇక్కడి అభి వృద్ధి గొప్ప అం టూ పై అధికారు ల ను మెప్పిస్తుంటారు.
కానీ, పత్రికా విలేకరు లు ఏదైనా వార్త సమాచారం కోసం ఆ అభివృద్ధి ఆదికారిని వివ రణ కోరితే అ త్యంత అర్జెంటు పని ఉంది త ర్వాత మాట్లాడతా అనే నిర్లక్ష్యం పు సమాధానం వినిపి స్తుంది. ఆయన వ్యవహార శైలితో ప్రభు త్వ పథకాల లబ్ధిదారులకు అం దాల్సిన రుణాలు నెలల తర బడి పెండింగ్ లో పడుతున్నాయ ని ఆ శాఖల అధికారులు ఆయన తీరు పట్ల బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
మండలా నికి బాస్ అయి ఉండి ప్రజా సమస్యలు, ప్రజలను పట్టించు కో కుం డా, కార్యాలయానికి వచ్చిన వారిని విసుక్కుంటూ సిబ్బందిని ఇబ్బం దులకు గురి చేస్తున్న అధి కారి చివరకు ప్రభుత్వం కేటయిం చిన నెంబర్ సైతం స్విచ్ అప్ చేస్తు న్నట్లు తెలుస్తుంది.
ఇప్పటి కైనా జిల్లా కలెక్టర్,ఉన్నతా ధికా రులు స్పందించి అభివృద్ధి అధి కారిపై చర్యలు చేపట్టి ప్రభుత్వ పథకాలను, అ భివృద్ధి పలాల ను ప్రజలకు అందించే విధంగా చూడాలని మండల ప్రజానీకం కోరుతుంది.ఈ విషయంపై సద రు అధికారిని వివారణ కోరేందు కు విజయక్రాంతి ప్రతినిధి ప్రయ త్నించగా ఆ అధికారి చరవాణి అందుబాటులో లేకపోవడం గమనార్హం.