26-09-2025 11:01:31 PM
నాగారం: నాగారం మండల నూతన ఎస్ఐగా ఎస్కె యాకూబ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నల్గొండ డీసీఆర్బిలో పని చేసి బదిలీ పై ఇక్కడికి వచ్చారు. గతంలో ఇక్కడ పని చేసిన ఐలయ్య సూర్యాపేటకు బదిలీపై వెళ్ళారు. ఈ సందర్బంగా నూతన్ ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని అన్నారు.