calender_icon.png 19 September, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి నేతలకు చెంపపెట్టు!

14-09-2025 12:00:00 AM

డాక్టర్ తిరునహరి శేషు :

నేపాల్ యువత ప్రభుత్వంపై, రాజకీయ నాయకులపై, వారి అవినీ తి, బంధుప్రీతి, వారసత్వ, అధికార దాహానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు ఆందోళనలు భారత్ సహా ఉపఖండాన్ని నివ్వెర పరిచిందని చెప్పొచ్చు. నేపాల్ యువత తిరుగుబాటును ఆందోళనగా మాత్రమే చూడకూడదు.. అది దేశం పట్ల వారికి ఉన్న బాధ్యతగా, ఆవేదనగా చూడాలి. నేపాల్‌తో పాటు ఉపఖండంలోని అన్ని దేశాల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు, అధికారులు పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీలంకకు సుదీర్ఘకా లం ప్రధానమంత్రిగా పనిచేసి ఆపై దేశాధ్యక్ష పదవి చేపట్టిన రణిల్ విక్రమసింగే ఇటీవల అవినీతి ఆరోపణలతో అరెస్టు కావటం, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరో పణలతో జైలుకి వెళ్లటం, పాక్ సైన్యాధ్యక్షుడిగా, తర్వాత దేశాధ్యక్షుడిగా పనిచేసిన జనరల్ ముషారఫ్‌పై అవినీతి ఆరోపణలతో ఆ దేశా న్యాయస్థానాలు ఉరిశిక్ష వి ధించాలనే తీర్పునివ్వటంలాంటివి ఆయా దేశాల్లో అవినీతి స్థాయిని చూపిస్తుంది.

ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి దేశా ల జాబితా--2024 ప్రకారం మొత్తం 180 దేశాల్లో భారత్ 96వ స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ 135, శ్రీలంక 121, బంగ్లాదేశ్ 149, నేపాల్ 107, చైనా 76వ స్థానంలో ఉన్నాయి. అవినీతి రహిత దేశంగా డెన్మా ర్క్ ఉంటే.. అత్యంత అవినీతి దేశంగా దక్షిణ సూడాన్ ఆఖరి స్థానంలో నిలిచింది.

నేపాల్‌లో తిరుగుబాటు 

నేపాల్ యువత, విద్యార్థులు ఈ స్థా యిలో తిరుగుబాటు చేస్తారని బహుశా ఆ దేశ పాలకులు కూడా ఊహించి ఉండరు. సీపీఐ- (యుఎంఎల్) కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరడం, దేశంలో నిరుద్యోగం 15 శాతానికి పెరగడం ఉద్యమానికి దారి తీసింది. దీనికి తోడు రాజకీయ వారసు లు, సంపన్నుల విలాసవంతమైన జీవనం తో విసిగిపోయిన యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

నేపాల్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన రాజకీయ నాయకు ల అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సోషల్ మీడియా అండగా నిలబడింది. దేశంలో సోషల్ మీడియాకు ఆదరణ పెరిగిపోవడంతో నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడి యా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించింది. దీంతో సెప్టెంబర్ 8న ‘జనరేషన్ జెడ్’ ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది. ఆందోళనకారులు.. పార్లమెంట్ భవనం, ప్రధానమంత్రి కార్యాలయాలను తగలబెట్టటమే కాకుండా నేపాల్ ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ పౌడ్వాల్‌ని రోడ్లపై ఉరికించి మరీ కొట్టారు.

మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా, అతని భార్య విదేశాంగ మంత్రి అర్జు రమాదేవుబాపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. మాజీ ప్రధాని కనాల్ భార్య అల్లర్లలో సజీవ దహనం కావడం ఆందోళనను మరింత ఉద్రిక్తత చేసింది. దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలు పెరిగిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ నేపా ల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. దేశంలో పెరిగిపోయిన అవినీతి, నిరుద్యోగం, రాజకీయ వారసుల సంపన్నుల విలాసవంతమైన జీవనశైలి..

నేపాలి యువత ఆగ్రహం కట్టలు తెంచుకొని తిరుగుబాటుగా మా రిందనే చె ప్పాలి. యువత తిరుగుబాటు నేపథ్యం లో ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన ఓలీ స్థానంలో ఎవరు బాధ్య తలు చేపడుతారు అన్న అంశం ఆసక్తిగా  మా రింది. ఈ నేపథ్యంలో విధుల్లో నిజాయితీ గా వ్యవహరిస్తారనే పేరున్న నేపాల్ సు ప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ సహా 35 సంవత్సరాల యువ నాయకుడు ఖాట్మండు మేయర్ బాలెన్ షా, నేపాల్ ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించిన విద్యుత్ బోర్డ్ మాజీ సీఈవో కుల్మన్ గీసింగ్‌ల పేర్లు పరిగణలోకి వచ్చా యి.

నేపాల్ సంక్షోభానికి తాత్కాలికంగా తెరదించాలని ప్రయత్నిస్తున్న సైనిక అధికారులు  ‘జెన్ జెడ్’ యువతతో చేసిన సం ప్రదింపుల అనంతరం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీని తా త్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడ్వాల్ ఆమె నియామకాన్ని ఆమోదించారు. అయితే తాత్కాలిక ప్రధానిగా బా ధ్యతలు చేపట్టిన మరుక్షణమే సుశీల కర్కీ పార్లమెంటును రద్దు చేసి మార్చి 5న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం విశేషం. 

ఉపఖండంలో అస్థిరత 

ప్రస్తుతం నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలే 2022లో శ్రీలంకలో, 2024లో బంగ్లాదేశ్‌లో జరిగాయి. అక్కడ కూడా ప్రజల తిరుగుబాటుతో ప్రభుత్వాలు కూలిపోయాయి. ప్రజాగ్రహానికి పాలకులు తల వంచక తప్పలేదు. శ్రీలంకలో ఆర్థిక సంక్షో భం, అప్పులు పెచ్చు మీరు పోయిన రాజపక్షేల నియంతృత్వం, అవినీతి, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో లంక ప్రజలు తిరుగుబాటు చేయడంతో గోటబాయో రాజపక్షే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవా ల్సి వచ్చింది.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ నియంతృత్వ పోకడలు, అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వ అవినీతికి వ్య తిరేకంగా ప్రజలు, యువత, విద్యార్థులు చే సిన తిరుగుబాటుకు తలొగ్గాల్సి వచ్చిం ది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశం నుంచి పారిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నేపాల్, బం గ్లాదేశ్, శ్రీలంక ఉదంతాలు వెనుక ఆ దేశ పాలకుల అవినీతి, దేశంలో నెలకొన్న నిరుద్యోగ పరిస్థితులు, ఆర్థిక సం క్షోభాలే యువత తిరుగుబాటుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఉప ఖండంలోని అనేక దేశా లు ఆర్థిక సంక్షోభంలో, రాజకీ య అస్థిరతలో, ఆందోళనలో చిక్కుకుపోయాయి. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ప రిణామాలే అందుకు ఉదాహరణ. బర్మాలోనూ, మారిషష్‌లోనూ పాకి స్తాన్‌లో నూ పరిస్థితులు అంత ఆశాజనకంగా ఏమీ లేవు. ఈ దేశాలతో పాటు చైనా, భా రత్‌లలో కూడా ఆర్థిక సమస్యలు, రుణభా రం, నిరుద్యోగం లాంటి సమస్య లు ఆ ందోళన కలిగించే అంశాలే.

శ్రీలంకలో అ నురశిరి దిశ నాయ కే నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై పరిస్థితులు కొంత కు దుటపడినప్పటికీ ఎప్పుడైనా ఆందోళనలు జరిగేందుకు ఆస్కారముంది. ఇక మహమ్మద్ యునస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన ప్పటికీ పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.

చైనాలో జిన్ పింగ్ అధ్యక్ష పదవికి ముప్పు పొంచి ఉందనే వార్తలు.. పా కిస్థాన్‌లో షహనాబాజ్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు.. బెలూచిస్తాన్ సమస్య ఆర్థిక సంక్షోభం, అప్పులు వారి డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నా యి. బర్మాలో సైనిక ప్రభు త్వ వ్యవహారం, మారిషస్‌లో మొయిజ్జు ప్రభు త్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

మనోళ్లు పాఠాలు నేర్చేనా?

పొరుగు దేశాల పరిణామాలు చూసై నా భారత్‌లో పాలకులు, రాజకీయ నా యకులు పాఠాలు నేర్చుకుంటే మంచిది. దేశంలో కూడా అవినీతి, నిరుద్యోగం పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా దేశంలో సంపన్న వర్గాలు, రాజకీయ నాయకులు, వారసులు తమ సంపదను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. గత కొంతకాలంగా ఈ అంశాలపై మన దేశ ప్రజల్లో నూ అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది.

దేశంలోని 40 శాతం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో కేంద్రీకృతమైందని ఇటీవలీ ‘ఆక్స్ ఫామ్’ నివేదిక పేర్కొం ది. ప్రజలు చాలా సహనశీలురు అయితే వారి సహనానికి పరీక్ష పెడితే మాత్రం తిరుగుబాటు మొదలవుతుంది. ఆ తిరుగుబాటుకు ఉదాహరణే నేపాల్. ప్రభుత్వం నియమించిన సైన్యం కూడా వారి ఉద్యమాన్ని ఆపలేకపోయింది.

పాలకులు నిర్మించుకున్న ఎత్తున గోడలు కూడా అక్క డి ప్రజల దెబ్బకు కూలక తప్పదని రుజు వు చేసింది. ఏది ఏమైనా నేపాల్‌లో ప్రస్తు తం జరుగుతున్న హింసాత్మకమైన అల్లర్లు ఆ దేశ గౌరవ ప్రతిష్టను దెబ్బతీశాయి. కాబట్టి యువత ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుత మార్గంలో నిరసనలు తెలపాలని భారత్ సహా అంతర్జాతీయ సమాజం కోరుకుంటుంది. 

     వ్యాసకర్త సెల్: 9885465877